తెలంగాణ

గురుకుల పాఠశాలలకు ఐదేళ్లలో రూ.2243 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తొలి ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.2243 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 602 కొత్త గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తున్నామని, ప్రజల నుంచి అపూర్వస్పందన వస్తోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన టీఆర్‌ఎస్ సభ్యులు బాల్కసుమన్, బాజిరెడ్డి గోవర్థన్, బభాపూరావు, రాథోడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ త్వరలో రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తామన్నారు. 602 గురుకులపాఠశాలల్లో 2,39,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. దాదాపు 11,785 మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని రిక్రూట్ చేశామన్నారు. ఎస్సీ గురుకులపాఠశాలలకు రూ.257.24 కోట్లు, ఎస్టీ గురుకులపాఠశాలలకు రూ.110.77 కోట్లు, మైనారిటీ పాఠశాలలకు రూ.954.50 కోట్లు, బీసీ పాఠశాలలకు రూ.920.95 కోట్లను ఖర్చుపెట్టామన్నారు. కాగా గురుకులపాఠశాలల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని, సీట్లకోసం విపరీతమైన పోటీ ఉందని సభ్యులు ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పశు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రంలో సంచార వైద్య పాఠశాలలను ప్రారంభించినట్లు చెప్పారు. 30 సీటెడ్ కాల్ సెంటర్‌తో, 1962 టోల్ ఫ్రీ నంబర్‌తో 100 సంచార పశువైద్య శాలలు పనిచేస్తున్నాయన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన హామీ పథకం కింద గ్రామీణాభివృద్ధి శాఖ గొర్రెల పెంపకందార్లకు వసతి, షెడ్ల కింద 16382 షెడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేసినట్లు చెప్పరు. పది గొర్రెలవు, మేకలకు షెడ్డు నిమిత్తం రూ.53 వేలను, 20 గొర్రెలు, మేకల నిమిత్తం రూ.89 వేలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమం నిమిత్తం పది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీకి చెప్పారు. తీవ్రమైన ప్రమాదసహాయం, అంగవైకల్య సహాయం, వికలాంగుల సాథనాలు, పరికరాలు, సహజ మరణ సహాయం, అంత్యక్రియల ఖర్చులు, పెళ్లికానుక, ప్రసూతి ప్రయోజనం, అసుపత్రిలో ఉన్నందుకు సహాయం, నైపుణ్యాభివృద్ధి, నమోదు చేసుకోని కార్మికులకు సహాయం కింద కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.