తెలంగాణ

కారెక్కిన విజయరామారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3:టిడిపి నేత, మాజీ మంత్రి, మాజీ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా విజయరామారావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తటస్తుల కోటాలో గతంలో విజయరామారావు 1999లో టిడిపిలో చేరి ఖైరతాబాద్ నుంచి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావానికి విజయరామారావు కూడా ఒక కారణం. విజయరామారావును మంత్రివర్గంలోకి తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... కెసిఆర్‌కు మొండిచెయ్యి చూపించారు. కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ పెట్టడానికి అదీ ఒక కారణంగా చెబుతారు. విజయరామారావు 2004 వరకు మంత్రిగా కొనసాగారు. ఓడిపోయిన తరువాత కూడా పార్టీలో చురుగ్గా కొనసాగినా, తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిన తరువాత క్రమంగా టిడిపి కార్యకలాపాల్లో పెద్దగా కనిపించలేదు. గత కొంత కాలం నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయానికి కృషి చేస్తానని విజయరామారావు తెలిపారు.

నీటిపారుదలలో
ఐఐటి, బిట్స్ సేవలు
ౄ సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టి
ౄ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

హైదరాబాద్, జనవరి 3: ప్రతిష్ఠాత్మక ఐఐటి, బిట్స్ విద్యాసంస్థలతో నీటిపారుదల శాఖను అనుసంధానం చేయనున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సచివాలయంలో మిషన్ కాకతీయపై ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయతోపాటు సాగునీటి ప్రాజెక్టు పనుల్లో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారంకోసం హైదరాబాద్ ఐఐటి, బిట్స్ సేవలను ఉపయోగించుకుంటామని మంత్రి తెలిపారు. ఆయా విద్యాసంస్థల అధికారులతో వెంటనే చర్చలు జరపాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జోషిని ఆయన ఆదేశించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగుతున్న మిషన్ కాకతీయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి, ఇఎన్‌సిలు మురళీధర్ రావు, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్సుర్, సిఇ మైనర్ ఇరిగేషన్ నాగేందర్ రావు, సురేష్ కుమార్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మిషన్ కాకతీయతో ఫేస్1లో ఇప్పటివరకు పూర్తయిన పనులను సమీక్షించారు.

మిషన్ కాకతీయ
తొలి దశ మార్చిలోగా పూర్తి
మంత్రి హరీశ్ రావు ఆదేశం

హైదరాబాద్, జనవరి 3:మిషన్ కాకతీయ ఫేస్ 1 గ్రౌండ్ అయిన పనుల్ని మార్చి లోగా పూర్తి చేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పూర్తి చేసిన పనులకు క్లోజింగ్ రిపోర్ట్ ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ విభాగంతోపాటు సిఇ నుండి డిఇఇ వరకు పరిశీలించాలని సూచించారు. ఆయన ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిగిలిపోయిన పనులు ఉంటే వాటిని పూర్తి చేయించిన తర్వాతనే తుది బిల్లులను చెల్లించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ ఫేస్- 2 సమీక్షల కోసం వార్షిక ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. రెండవ విడత పనులు ప్రారంభం అవుతున్నందున జిల్లా సమన్వయ కమిటీలను పునర్ వ్యవస్థీకరించుకొని, రెగ్యులర్‌గా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ఫేస్‌వన్‌లో పూర్తయిన చెరువుల పరిరక్షణ, నిర్వాహణ కోసం గ్రామస్థాయి కమిటీలు వేయాలని సూచించారు. మిషన్ కాకతీయ ఫేస్-2లో ప్రారంభం కానున్న పనులకు తప్పనిసరిగా సాయిల్ టెస్ట్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతి నియోజక వర్గంలో 20 శాతం చెరువులను సెకండ్ ఫేస్ కింద మంజూరు చేసినట్టు తెలిపారు. మిషన్ కాకతీయ రెండవ విడతలో ఆమోదం పొందిన చెరువుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ఆ చెరువు పనులను తక్షణమే వంద శాతం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ సంబంధిత సమస్యలపై ప్రతి సోమవారం అటవీ శాఖతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫేజ్-1 అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫేస్-2లో ముందుగానే చెరువును సందర్శించి అంచనాలు రూపొందించాలని అన్నారు. జనవరి 15 లోపు 50 శాతం చెరువుల అంచనాలు, జనవరి 30 లోపు వందశాతం చెరువుల అంచనాలను ఇవ్వాలని ఆదేశించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఎస్‌ఇ పోస్టులను, జగిత్యాల, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఎటూరు నాగారం డివిజన్ల ఇఇలను వెంటనే నియమించాలని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 15 రోజుల్లో ఎఇఇల నియామకాలు జరగబోతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.