తెలంగాణ

కాంట్రాక్టు ఉద్యోగులపై బదిలీల నిషేధం ఎత్తివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14:రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయడానికి ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని అధికార ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
శనివారం మండలి సమావేశాల్లో పాల్గొన్న పల్లా మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాలు వర్ణణాతీతంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భార్య,్భర్త ఓకే చోట పని చేసే అవకాశం లేకపోవడంతో ఆయా కుటుంబ సభ్యుల మధ్య దూరం పెంచడమేనన్నారు. భర్త ఆదిలాబాద్, భార్య మహబూబ్‌నగర్‌లో పని చేసే విధానానకి ప్రభుత్వం మార్గం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం లెక్చరర్ల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 3 నుంచి ఐదు (అంగన్‌వాడీ) సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శిలు బలంగా ఉన్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చిన్న పిల్లను బలవంతంగా ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయని మంత్రి అన్నారు.
అంగన్‌వాడీలు కేవలం భోజనం, గుడ్డు తినడానికే పనికి వస్తున్నాయన్న ఆరోపణలు వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే అంగన్‌వాడీ వ్యవహారం కేంద్రం చూస్తోందని, ఏదైనా మార్ములు చేర్పులు చేయాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. అంగన్‌వాడీల్లో ఇంగ్లీషు బాషను అమలు చేయడం ద్వారా పిల్లలు కేజీ తరగతిలో చేర్చడానికి అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా ఇంగ్లీషు చదువులు లేకపోతే కేజీ తరగతిలో ప్రవేశ పరీక్షలో పిల్లలు పాస్ అయ్యి అవకాశం కోల్పోతారని నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలో వంట చేసే వర్కర్లకు కనీసం 3వేలు పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిసూచించారు. అంగన్‌వాడీలకు ఇచ్చేది జీతాలు కాదని కేవలం గౌర భృతిగా భావించాల్సి ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అంగన్‌వాడీలకు 3వేలకు పెంచడాన్ని జీవన్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీస్ చేస్తానిన సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.