తెలంగాణ

‘యురేనియం’కు అనుమతుల్లేవ్: కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇవ్వబోమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాక మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం మండలి సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్ పై విధంగా స్పందించారు. యురేనియం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కితీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడాన్ని మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఉత్తర్వులు ఇస్తే కదా వెనక్కితీసుకోవడానికి అంటూ విపక్షాలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. యురేనియం తవ్వకాలను నిషేదిస్తూ శాసన సభ, మండలి సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించి కేంద్రానికి పంపుతామని కేటీఆర్ సభకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో యురేనియంపై శాశ్వతంగా నిషేదం ఉండే విధంగా ప్రయత్న చేస్తామని సభ్యులకు సూచించారు.ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి పత్రికలు సైతం అబద్దదపు వార్తలు రాయడం ఏమిటని ఆయన మీడియాపై చిందులు వేశారు. యురేనియంపై ఒక పత్రిక ( ఆంధ్రభూమి కాదు) నీచమైన విధంగా రాతలు రాయడం దుర్మార్గమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా యురేనియం తవ్వకాలు జరిపితే శ్రీశైలం, నాగార్జున సాగర్ నీరు కలుషితం అవుతాయని ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురిండం సిగ్గుచేటన్నారు. యురేనియం ప్రభావంతో హైదరాబాద్‌కు ఉపద్రవం వస్తుందని, నగర ప్రజలు రాబోవు రోజల్లో పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటారని ఆ పత్రిక చెప్పడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తల ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పడానికి ఆ పత్రిక ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని ఆకుపచ్చదనంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నల్లమలలో ఒక్క చెట్టుకూడా తొలగించమని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో యురేనియం కోసం అనే్వషణ కోసం అధికారులు వెళ్ళినట్లు మంత్రి గుర్తు చేశారు. నల్లమలలో యురేనియం ఏ మేరకు ఉందోలేదో తెలుసుకోవడానికి అధికారుల ప్రయత్నం తప్పా మరొకటికాదన్నారు.
యురేనియం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా అనేక విధాలుగా వినియోగించుటుంటారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే యురేనియం తవ్వకాల కోసం అనే్వషణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. యురేనియం తవ్వకాల కోసం కేంద్రం నిర్ణయమే ప్రధానమని, అయితే వాటిని అమలు చేయడానకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ మంత్రి గుర్తు చేశారు. అటవీ ప్రాంతలాను పరిరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. 1992- 2011 మధ్య కాలంలో యురేనియం అనే్వషణ కోసం సర్వే, తనిఖీని చేపట్టడానికి కేంద్రం ఆదేశించిందన్నారు. నల్లమల సమీపాన ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వలోని ప్రాంతాల్లో ఎఎండీ ఎటువంటి అనే్వషణను చేపట్టలేదన్నారు. యురేనియం తవ్వికాలు జరపాలంటే ఖచ్చితంగా అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం అన్నారు. యురేనియం కోసం చాలా నియమనిబంధనలు ఉన్నాయన్నారు. అటవీ ప్రాంతల్లో అటవీ ట్రాకులను మాత్రమే వినియోగించాలని, మనుషులు, యంత్రాల కదలికలు కోసం ఎటువంటి నూతన రోడ్లను వేయడం వంటి పనులు చేపట్టకూడదన్నారు. రాత్రి సమయాల్లో ఎటువంటి కార్యక్రమాలను జరపకూడదన్నారు. కేవలం పగులు మాత్రమే అనే్వషణ కొనుసాగించాలని చట్టంలో ఉందన్నారు. ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూదన్నారు. చెట్లు నరకడం లేదా కూల్చడం జరగకూడదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎంపీ విషయాలు తెలుసుకోకుండా యురేనియంపై ఇష్టానుసారం మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి పేరు చెప్పకుండానే ఆయనపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
యురేనియంపై ఇంకా సభ్యులు ఏమన్నారంటే..
నల్లిగొండ జిల్లాలో యురేనియంకు సంబంధించి గతంలో సర్వే పూర్తి చేశారన్నారు.
తాను నల్లగొండ ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర అధికారులతో పాటు యురేనియం కార్పొరేషన్ అధికారులు సంప్రదించారని ఆయన గుర్తు చేశారు. యురేనియం శుద్ధి కర్మాగారం నెలకొల్పుతామని వారు చెప్పారని ఆయన సభ్యులకు వివరించారు.
కడియం శ్రీహరి
పర్యావరణ దెబ్బతింటుందని శాస్తవ్రేత్తలు చెబుతుంటారని అయితే వాటి నిజానిజాలు తనకు తెలియవని కడియం శ్రీహరి అన్నారు. యురేనియంపై జరుగుతున్న గందరగోళాన్ని ఆపాలంటే అసెంబ్లీ, మండలిలో యురేనియంపై నిషేదం శాశ్వతంగా ఉండే విధంగా ఏకగ్రీవంగా తీర్మాణాన్ని కేంద్రానికి పంపుదామని మంత్రి కేటీఆర్‌కు శ్రీహరి సూచించారు.
బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు
యురేనియంపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవాలు చెప్పకుండా రేవంత్‌రెడ్డి వ్యవహరించడం ఏమిటని నిలదీశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
యురేనియం నిక్షేపాలపై జరుగుతున్న అనే్వషణపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఆదివారం పత్రికలో వచ్చినది వాస్తవమా కదా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నాంచారు. పత్రికల్లో వార్తలు రావడంతో నల్లమలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు యురేనియంపై భయాందోళన చెందుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.
జీవన్‌రెడ్డి
నల్లమలలో యురేనియంపై వస్తున్న వార్తల పట్ల ప్రభుత్వం ఖచ్చితమై సమాచారం అందిస్తే ప్రజలు శాంతిస్తారన్నారు. అలాగే ఎమ్మెల్సీ కనే్న ప్రభాకర్ మాట్లాడుతూ యురేనియంపై గతంలో తెరాస ఉద్యమాన్ని నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు.
ఎంఐఎం సధ్యులు జాప్రీ మాట్లాడుతూ యురేనియం నిక్షేపాలపై జరుగుతున్న అనే్వషణను తక్షణం నిలుపుదల చేయాలన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ యురేనియంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఊహాజనిత, కల్పిత ఉద్యమాన్ని చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు.