తెలంగాణ
8055 కేసులు నమోదు చేసిన షీ టీంలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధించే ఆకతాయిలపై షీ టీంలు ఇంతవరకు 8055 కేసులను నమోదు చేసినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో వంద, సైబరాబాద్‌లో 60 షీ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో, కమిషనరేట్ విభాగంలో రెండు నుంచి ఆరు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 8055 కేసుల్లో 2554 ఎఫ్‌ఐఆర్ కేసులు, 5501 చిన్న కేసులను నమోదు చేశామన్నారు.