తెలంగాణ

బడ్జెట్ గణాంకాలు నమ్మశక్యంగా లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌పై చెబుతున్న గణాంక వివరాలు నమ్మశక్యంగా లేవని, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ శ్రీ్ధర్ బాబు కోరారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంథని నియోజకవర్గంకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వుకోవడానికి లేకుండాపోయిందని, ఒక్క ఎకరానికి సాగునీరు అందదని చెప్పారు. మా ప్రాంత వనరులు ఏమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను 2011లో విడదల చేశారని, అప్పటి నుంచి రిక్రూట్‌మెంట్ జరగలేదన్నారు. వయోపరిమితిని కూడా 44 నుంచి 47 సంవత్సరాలకు పెంచుతామన్నారని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1.82 లక్షల కోట్ల నుంచి రూ..1.42 లక్షల కోట్లకు కుదించడం, ఆర్థిక మాంద్యం వల్ల ఇలా జరుగుతోందని చెబుతున్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టని, దీని వల్ల తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో రాజ్యాంగ బద్ధంగా పార్టీని విలీనం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేయడంపై వల్ల రైతులు నిశ్చితంగా ఉన్నారని, రైతు బంధు, రైతు బీమా పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారని చెప్పారు.