తెలంగాణ

భారీ వర్షాలు వస్తే.. హైదరాబాద్‌ను ఆదుకోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: భారీ వర్షాలు వస్తే హైదరాబాద్‌ను ఆదుకునే పరిస్థితులు లేవన్నారు. ఆదివారం మండలి సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వస్తే వర్షపు నీటిని తొలిగించడానికి అవసరమైన నాలాలు ( కాలువలు) లేని కారణంగా వరద నీటి బయటకు పంపడానికి అవకాశం లేదన్నారు. హైదరాబాద్‌లో 390 కిమీ దూరం కాలువలు ఉన్నాయన్నారు. మురుగు కాలువల్లో పరుపులు, ప్లాస్టిక్ డ్రంమ్‌లు, బాటిళ్సు వంటి వస్తువులను వేయడంతో కాలువల్లో మురుగునీరు ప్రవహించడానికి వీల్లేకుండా పోతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపయోగ వస్తువులను డ్రైనేజ్‌ల్లో వేయకుండా ఉండడానికి ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అపార్ట్‌మెంట్లు, కాలనీల వాసులకు వర్షపునీటి తొలగించే అంశాలపై జంటనగర వాసులకు అవగాహన కల్పించాలన్నారు. గంటకు 32-35 ఎంఎం వర్షం వస్తే జంటనగరాల్లో ఉన్న కాలువలు ద్వారా వర్షపు నీటిని పంపించడానికి వీలైతుందన్నారు. ఒకవేల కుంభవృష్టి వర్షాలు వస్తే ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు.