తెలంగాణ

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణకు తమ ప్రభత్వం ఎల్లవేళలా ముందుంటుందన్నారు. శనివారం ఆర్టీసీ టిఎస్ ఎన్‌ఎంయూ అదనపు జాయింట్ సెక్రటరీ కావలి హన్మంతు, వర్కింగ్ ప్రెసిడెంట్ కమాల్‌రెడ్డి తదితరులు మంత్రి నివాసంలో కలసి ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ ఉద్యోగులకు సిఎం కెసిఆర్ పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా వేతనాలు పెంచారని, సదుపాయాలు కల్పించారని చెప్పారు. అయితే రెండో విడత పే స్కేల్స్, ఎరియర్స్, డిఏ ఎరియర్స్ కార్మికులకు ఒప్పందం ప్రకారం ఇవ్వవలసి ఉందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిధుల విడుదలతోపాటు న్యాయమైన కోర్కెలు పరిష్కరించేందుకు మంత్రి చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకమైందని చెప్పారు. నష్టాల ఆర్టీసీని ఆదుకునేందుకు కెసిఆర్ గతంలో అత్యవసరంగా రూ. 250 కోట్లు అందించారని, ప్రస్తుతం సుమారు రూ. 700 కోట్లు నష్టాన్ని భరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, వీటిలో 1200 కొత్త బస్సులు కొనేందుకు రూ. 300 కోట్లు కేటాయించామని, బస్‌స్టాండ్ల అభివృద్ధికి రూ. 32 కోట్లు నిధులు అందించామని వివరించారు. ఆర్టీసి ఉద్యోగులకు గత పాలకుల కాలం నుంచి బకాయిలుగా ఉన్న ఎరియర్స్ నిధులు విడుదల చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.