తెలంగాణ

‘యురేనియం’కు అనుమతి ఇవ్వలేదు, ఇచ్చేదీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ఇంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో కూడా ఇవ్వబోదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం నాడు ఇందుకు సంబంధించి అసెంబ్లీలోనూ, అనంతరం శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని సీఎం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లో నల్లమల అడవుల్లో నాశనం కానివ్వబోమని, అనుమతులు ఇవ్వొద్దని చెబితే కూడా గతంలో అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు మంజూరు చేశారని చెప్పారు. ఆంధ్రాలో తవ్వకాలు ప్రారంభం అయ్యాయని, రైతాంగానికి అన్నం పెట్టేకృష్ణానదిపై ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు కింద డెల్టా కలుషితమై నాశనం అయ్యే పరిస్థితి వస్తుందని, హైదరాబాద్‌కు తాగునీటిని కూడా తీసుకోలేని ప్రమాదం ఏర్పడుతుందని, వీటన్నింటి దృష్ట్యా ఎట్టిపరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి తెలిపారు.