తెలంగాణ

కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభ మవుతుందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ కాకతీయ టెక్సటైల్ పార్క ఎప్పుడు ప్రారంభమవుతుందో లేదో స్పష్టత లేకపోతోందని అధికార పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్సటైల్ పార్కపై జాప్యం జరుగుతుండడంతోఅనుమానాలు బలపడుతున్నాయని కడియం శ్రీహరి, శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం మండలి సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీలు చర్చల్లో పాల్గొంటూ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు ఉన్నా టెక్స్‌టైల్ పార్క ప్రారంభం కాకపోవడంతో వరంగల్ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ టెక్సటైల్ పార్క ప్రారంభించకపోవడంలో ఆలస్యం అయినమాట వాస్తవమేనని మంత్రి ఒప్పుకున్నారు. టెక్స్‌టైల్ పార్క్ వస్తే దాదాపు లక్షా 13వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్తాయన్నారు. పార్క్ కోసం 1200 ఎకరాలు భూ సేకరణ చేశామన్నారు. ఇంకా 75 ఏకరాలు మాత్రమే భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ఇటీవల వరంగల్ వెళ్లివచ్చారని కొంత సమాచారం ఉందన్నారు. పార్క అభివృద్ధి చేయడానికి 16 ఒప్పందాలు జరిగాయన్నారు. పెట్టుబడులు పెట్టే యజమానుల్లో ఆత్రుత పెరిగిందన్నారు. పార్క్‌లోదాదాదపు 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. పార్క కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 130 కోట్లు ఖర్చు చేశామన్నారు. అండర్ బ్రిడ్జి కోసం మరో రూ 20 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. విద్యుత్ 130 కెవీ స్టేషన్ నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్కలో వౌలిక వసతులు చకచక జరిగిపోతున్నాయని మంత్రి గుర్తు చేశారు.