తెలంగాణ

విష జ్వరాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: విష జ్వరాలపై అధికార, విపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదంతో సభ దద్దరిల్లింది. రాష్ట్రం విష జ్వరాలతో అల్లాడుతోందని, హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని, డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, ప్రభుత్వాసుపత్రుల్లో విష జ్వర బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని, ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ అంశంపై చర్చ జరుగుతుండగా వాగ్వాదం జరిగింది. తమకు ఇంకా మాట్లాడేందుకు మైక్ కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సీతక్క చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి నిలబడి మైక్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుజోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశంపై వేరే రూపంలో వస్తే చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.
అనంతరం మంత్రి ఈటల రాజేందర్ బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 2407 డాక్టర్లు, ఫిజీషియన్లు ఉద్యోగాలు, 7647 పారా మెడికల్ సిబ్బంది పదవులు ఖాళీగా ఉన్నాయన్నారు. డాక్టర్ పోస్టుల కోసం 2266 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా, ఇంతవరకు 1657 మంది చేరారన్నారు. 4441 మంది పారామెడికల్ స్ట్ఫా నర్సు పదవులను నోటిఫై చేయడమైందన్నారు. ఎంపిక తుదిదశలో ఉందని, గౌరవవ హైకోర్టు ఎంపికను నిలిపివేసినట్లు చెప్పారు. ఆరోగ్య శాఖకు చెందిన అన్ని కేటగిరీ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు బోర్డును ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
వర్షకాలం వస్తే వైరల్ జ్వరాలు వస్తాయని, ఇది వాస్తవమేనన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు విష జ్వరాలను వాడుకోరాదన్నారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వల్ల అవుట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ రోగులు పెరిగారన్నారు. రాష్ట్రంలో వైద్యులకు సెలవులను రద్దు చేశామని, అహర్నిశలు రోగులకు సేవలు అందిస్తున్నారన్నారు. అంతకుముందు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోల వైద్య సదుపాయాలు మృగ్యమన్నారు. ఒక్కో బెడ్‌పై నలుగురు వరకు రోగులను పడుకోపెడుతున్నారన్నారు. ఆధునిక వైద్య పరీక్షల విభాగాలు లేవన్నారు. ప్రభుత్వాసుపత్రులకు పట్టిన జబ్బును వదిలించాలన్నారు. ములుగులో 50 పడకల ఆసుపత్రిని వంద పడకలకు పెంచినా, మందులు ఇవ్వడంలేదన్నారు. సీఎం ఆఫీసులో ఒక కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆసుపత్రుల్లో చేరిన విష జ్వర బాధితులను పట్టించుకోరా అని సీతక్క నిలదీశారు. భట్టి మాట్లాడుతూ వైద్యులపోస్టులను భర్తీ చేయలేదని, పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుచెప్పారు. దీంతో భట్టి మాట్లాడేందుకు అప్పటికే సమయం ఇచ్చిన స్పీకర్ మైక్‌ను కట్‌చేశారు. మంత్రి ఈటల లేచి బదులిచ్చారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు.