తెలంగాణ

నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 15: నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రామ్మోన్ రెడ్డి, సీతక్క, జంగారెడ్డితో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించిందని అన్నారు. తెలంగాణలోని యువత నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. అతి ముఖ్యమైన సమస్యపై అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం విచాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఉద్యమించేందుకు కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాల గురించి సరైన సమాదానం చెప్పకుండా ప్రభుత్వం దాటవేసే దోరణిని అవలంభిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, వసతుల లేమితో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఫ్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి నానాటికి ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వక పోవడం పారిశుధ్య సమస్య తలెత్తి వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. ఆసుపత్రుల్లో వసతులు కల్పించడంతో పాటు వైద్యులు, సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు: సీతక్క
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క అన్నారు. ఎంతో కాలంగా పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు.
సంగారెడ్డి ఆసుపత్రిని సందర్శించండి: జగ్గారెడ్డి
నిత్యం వేలాది మంది రోగులు వచ్చే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించాలని జగ్గారెడ్డి కోరారు. విషజ్వరాలు, ఇతర వ్యాధులతో వేలాది మంది రోగులు జిల్లా ఆసుపత్రికి వస్తుండగా సరైన వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రాణం పోయే వరకు టీఆర్‌ఎస్‌లోనే..ముత్తిరెడ్డి
ప్రాణం పోయే వరకు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు కొందరు చేస్తున్న ఆరోపణలను మానుకోకపోతే న్యాయ కోవిదుల సలహాతో సదరు వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకు తగినంత నిధులు కేటాయించామని అన్నారు. సంక్షేమ రంగానికి ఎక్కడ కోతలు విధించకుండా ముఖ్యమంత్రి అద్బుతంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అనుభవ రాహిత్యంగా మాట్లాడుతుందని విమర్శించారు.