తెలంగాణ

ఇక ప్రతి ప్రాజెక్టు వద్ద టూరిజం కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సాగునీటి ప్రాజెక్టు వద్ద ఒక టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఆదివారం మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ టూరిజం అభివృద్ధిపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విధంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్టుల వద్ద మాత్రమే టూరిజం హాటళ్లు ఉన్నాయని త్వరలో అన్ని ప్రాజెక్టుల టూరిజం హాటళ్లు ఏర్పాటు చేస్తాలమన్నారు. ప్రతి మూడు జిల్లాలకు ఒక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో టూరిజం ఆధ్వర్యంలో 35 హటళ్లు నడుస్తున్నాయన్నారు. మిగతా చోట్ల ఫుడ్ కోర్క్స్‌లు నడుపుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగాల విషయంలో కాంట్రాక్టు మద్దతిలో భర్తీ చేస్తారని చెప్పారు.
బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది
రాష్ట్రంలో బీసీ రెసిడెన్సీ కాలేజీల్లో చనువుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగాపెరుగుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్సీలు మల్లేశం, పల్లా రాజేశ్వరెడ్డి బీసీ రెసిడెన్సీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య, వారి బాగోగుల గురించి మంత్రి వివరించాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు 242 బీసీ రెసిడెన్సీ పాఠశాలలు ఉన్నాయన్నారు. రెసిడెన్సీ పాఠశాలల్లో ఉద్యోగుల కొరత లేదన్నారు.