రాష్ట్రీయం

కోడెలది ఆత్మహత్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అర్ధాంతర మృతి, ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలు విశే్లషణలు, వదంతులతో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన మరేదైనా కారణంతో మనస్తాపం చెందారా? లేదా ఇంకేమైనా కారణముందా? అని ప్రస్తుతం ప్రతిఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్న ప్రశ్నలివి. హైదరాబాద్‌లోని తన ఇంటికి కోడెల రెండు రోజుల క్రితం వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొడుకు శివరామకృష్ణ పిలవడంతోనే ఆయన హైదరాబాద్‌కు వచ్చారని అంటున్నారు. కోడెలకు, ఆయన కుమారుడికి మధ్య మనస్పర్థలున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాదనలు సాగి వాగ్వాదానికి దిగడంతో శివరాం తండ్రిపై చేయి చేసుకున్నాడని, ఇది భరించలేక కోడెల ఆత్మహత్య చేసుకొని ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. కానీ కోడెల సన్నిహితులు మాత్రం కోడెల పరికివాడు కాడని, ఆయనది ఆత్మహత్య కాకపోచ్చునని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుడు, వృత్తిరీత్యా వైద్యుడు ఆయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని పలువురు చెబుతున్నారు. కోడెల ఆకస్మిక మృతి వ్యవహరంలో అనేక ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. కోడెల కొడుకు బసవతారకం ఆసుపత్రికి రాలేదని తెలుస్తోంది. తండ్రి విషమ పరిస్థితులో ఆసుపత్రిలో ఉన్నా కొడుకు ఎందుకు రాలేదు? ప్రస్తుతం కోడెల కొడుకు ఎక్కడ ఉన్నాడు? తండ్రి మృతి విషయం అతనికి తెలుసా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోడెలను అత్యవసరంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్చడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి సమీపంలో ఉంది. అయినా నిమ్స్ ఆసుపత్రిలో కాకుండా బసవతారంకం క్యాన్సర్ ఆసుపత్రికి ఆయనను ఎందుకు తరలించారో ఎవరికీ అంతుపట్టడంలేదు.
నేడు గుంటూరుకు పార్థివదేహం..
మంగళవారం ఉదయం 7 గంటలకు కోడెల పార్థివ దేహాన్ని గుంటూరుకు తరలిస్తారు. హైదరాబాద్ నుంచి మాసబ్ టాంక్ శంషాబాద్, చౌటుప్పల్, చిట్వాల, కోదాడ, విజయవాడ మీదుగా గుంటూరుకు చేరుకుంటుంది. పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం గుంటూరు పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం కోడెల స్వగ్రామానికి తీసుకువెళతారని పార్టీ నేతలు తెలిపారు.
పోలీస్ విచారణకు ఇంటి పనివాళ్లు..
కోడెల ఇంటి పనివాళ్లను విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదికలో కోడెలది ఆత్మహత్య అని తేలడంతో తెలంగాణ పోలీసులు ఆయన ఇంటికి మరోసారి వెళ్లి వివరాలు మరోసారి సేకరించారు. కోడెల వ్యక్తిగత డ్రైవర్, గన్‌మెన్‌తో పాటు పనివాళ్లను కూడా పోలీస్టేషన్‌కు తరలించి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేట్‌మెంట్ రికార్డు పూర్తయిన తర్వాత వారిని తిరిగి ఇంటికి పంపించారు.