తెలంగాణ

విరిగిన రైలు పట్టా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 9: వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు-మానుకోట రైల్వే స్టేషన్‌ల మధ్య అప్‌లైన్‌లో వెల్డింగ్ ఊడి రైలు పట్టా విరగడంతో శనివారం పలు రైళ్ల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. వెల్డింగ్ విడిపోయిన అంశాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి దాన్ని సరిచేశారు. దీంతో తిరిగి రైళ్లు యథాతథంగా నడిచాయి. రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడినప్పటికీ సమస్య త్వరగా పరిష్కారమైన తిరిగి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగడంతో ప్రయాణికులు ఉపిరి పీల్చుకున్నారు.