తెలంగాణ

రాష్ట్రంలో పెరిగిన సౌర, పవన విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని ఇంధన మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. గువ్వల బాలరాజు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కే మహేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంగళవారం నాడు శాసనసభలో మంత్రి బదులిచ్చారు. సౌరస్థాపిత సామర్ధ్యం 3627 మెగావాట్లు కాగా, పవన స్థాపిత సామర్ధ్యం 100.8 మెగావాట్లు అని అన్నారు. మొత్తం ఎన్‌సీఈ సామర్ధ్యం 3898 మెగావాట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లలో సౌర, పవన విద్యుత్‌ను పరిశీలిస్తే 2016-17లో 1031 మెగావాట్ల సౌరవిద్యుత్, 207.24 మెగావాట్ల పవన విద్యుత్, 2017-18లో 3751 మెగావాట్ల సౌరవిద్యుత్, 164.09 మెగావాట్ల పవన విద్యుత్, 2018-19 సంవత్సరానికి 5977 సౌరవిద్యుత్, 228.36 మెగావాట్ల పవన విద్యుత్ ప్రణాళిక వేశామని అన్నారు.
రాష్ట్రంలో 189 మార్కెట్ కమిటీలు
రాష్ట్రంలో ప్రస్తుతం 189 వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. కొత్తగా మరో 11 మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని సాధ్యా, సాధ్యాలను పరిశీలించిన మీదట తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మార్కెట్ యార్డుకు ఒక కమిటీ పనిచేస్తోందని, వీటిలో 27 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఎస్సీలకు, 11 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఎస్టీలకు, 51 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు బీసీలకు, 89 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఓసీలకు కేటాయించామని వివరించారు.