తెలంగాణ

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం అవతరించినా రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతోందని, ఆ నాటి ఆగడాలు, ఆకృత్యాలు ప్రస్తుతం జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలోజరిగిన విమోచన దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. కర్నాటక, మహారాష్టల్రో మాదిరిగా తెలంగాణలో కూడా సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రజల ఆకాంక్షను కేసీఆర్ సమాధి చేశారన్నారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లు కేసీఆర్ నడుచుకుంటున్నారన్నారు. కేసీఆర్ యాదగిరి గుట్ట ఆలయంలో తన బొమ్మలు చెక్కించుకున్నారని, అసెంబ్లీని, సచివాలయాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారని, ఇదంతా నిరంకుశత్వానికి పరాకాష్ట అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ నాటి ప్రభుత్వాలను విమోచన దినోత్సవాలను ఎందుకు నిర్వహించరని నిలదీసిన కేసీఆర్, ఈ రోజు అధికారంలోకివచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. కాగా, హైదరాబాద్ సంస్థానం విముక్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు చేపట్టిన ఆపరేషన్ పోలో కారణమంటూ పటేల్ ఆశయాల సాధనకు అంకితం కావాలని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ నిజాం నియంతృత్వం నుంచి హైదరాబాద్‌ను కాపాడారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. ఆ రోజు పటేల్ తీసుకున్న సాహసమైన నిర్ణయం వల్లనే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి మంగళవారం ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం రోగులకు పండ్లను పంచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ఎన్నో సంస్కరణలను అమలు చేసి దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. 18వేల గ్రామాల్లో కరెంటు ఇచ్చి వెలుగు నింపారన్నారు. ఫుడ్ సెక్యూరిటీ కింద కేజీ బియ్యానికి 28 రూపాయలు ఇచ్చారన్నారు. ఒక దేశం, ఒక పన్ను, ఒక గ్రిడ్, ఒక రాజ్యాంగం పేరుతో దేశ గతిని మార్చారన్నారు. అనంతరం కిషన్ రెడ్డి దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర భేటీ పడావో కన్వీనర్ కే గీతామూర్తి ఆధ్వర్యంలో నిర్మించిన ఐదు వందల ఏళ్ల తెలంగాణ చరిత్ర డీవీడీని విడుదల చేశారు.
*చిత్రం... హైదరాబాద్‌లో మంగళవారం బీజేపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు