తెలంగాణ

గ్రామాల స్వరూపం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గ్రామాల ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల స్వరూపం మారాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి దిశా నిర్దేశం చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలన్నారు. బుధవారం బీఆర్‌కే భవన్ నుంచి సీఎస్ జోషి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన గ్రామాల ప్రత్యేక ప్రణాళికపై జిల్లాల్లో జరుగుతోన్న పనులను సీఎస్ సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యాచరణ అమలు కావాలన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు గ్రామాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించి వార్షిక, పంచవర్ష ప్రణాళికలొ రూపొందించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డులు, స్మశారన వాటికలొ, నర్సరీలకు స్థలాలను గుర్తించి వినియోగంలోకి తీసుకరావాలన్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు కొనసాలన్నారు. మన ఊరు...మనమే బాగుపర్చుకొనేలా ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్నారు. గ్రామాలలో గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలన్నారు. పవర్ వీక్‌లో భాగంగా శిథిలమైన స్తంభాల తొలగింపు, విద్యుత్ తీగలు సరిచేయడం, మూడవ తీగను ఏర్పాటు చేయడం, గ్రామ పంచాయతీలకు మీటర్లు బిగించే పనులు జరుగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో పనులు చేపట్టాలన్నారు. జరిగే పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు. గ్రామాలలో చెత్త సేకరణకు డస్ట బిన్‌లు సరఫరా చేసిన జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్‌ను సీఎస్ అభినందించారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలలో పనుల కోసం నిధుల కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ మాట్లాడుతూ, ప్రత్యేక కార్యాచరణపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల అంచనా కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ గ్రామాలలో వార్షిక హరిత ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. .
*చిత్రం...కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ జోషి