తెలంగాణ

హిందీపై ఏకపక్ష నిర్ణయాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హిందీ భాషను దేశంలోని అన్ని రాష్ట్రాలపై రుద్దరాదని, దీని వల్ల భిన్నత్వంలో ఏకత్వం అనే భావానికి విఘాతం కలుగుతుందని టీపీసీసీ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ అన్నారు. హిందీని దేశంలో సాధారణ భాషగా చేయాలని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా అనడం బాధ్యతా రాహిత్యమన్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఈ విషయమై ఆందోళన మొదలైందన్నారు. బుధవారం వారు ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, చరిత్ర నుంచి అమిత్‌షా గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. బీజేపీకి సంఖ్యాబలం ఉందని అమిత్‌షా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఏకాభిప్రాయం లేకుండా ఎలాపడితే అలా జవాబుదారీతనం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే హిందీ భాష అంశం భావోద్వేగంతో కూడిన అంశమన్నారు.