తెలంగాణ

రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో బుధవారం నాడు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నామని, చెరువులను బాగుచేసుకున్నామని, కాళేశ్వరం ఛాలెంజింగ్‌గా పూర్తి చేశామని అన్నారు. మిషన్ భగీరథను సైతం ఛాలెంజింగ్‌గా పూర్తిచేశామని, 24 గంటల విద్యుత్ సాధ్యమని అన్నారని, దానిని సుసాధ్యం చేసి చూపించమని అన్నారు. రెండోసారి అధికారం చేపట్టాక గ్రామ సీమలు బాగు చేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకుని పెద్ద ఎత్తున ముందుకు పోతున్నామని అన్నారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ముందుకు పోతున్నామని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీకీ ఒక ట్రాక్టర్ కొనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.