తెలంగాణ

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరించిన చెరువులతో 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు లభిస్తుందని అన్నారు. మిషన్ కాకతీయపే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ డాక్యుమెంటరీని రూపొందించిందని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నామని వెల్లడించారు. మిషన్ కాకతీయకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద 21,275 చెరువులను పునరుద్ధరించామని అన్నారు. 14.15 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని అన్నారు. నీతి ఆయోగ్ 2017 ఆగస్టు నివేదికలో నీటి నిర్వహణలో ఎంపిక చేసిన ఉత్తమ విధానాల్లో మిషన్ కాకతీయ ప్రయోజనాలను వివరించిందని అన్నారు.
మాధవరెడ్డి ప్రాజెక్టు వ్యయం సవరణ
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని 483.95 కోట్లకు సవరించామని హరీష్‌రావు తెలపారు. చిరుమల్లి లింగయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఇంత వరకూ 328.29 కోట్ల విలువైన పనిని పూర్తి చేశామని, అంటే ఇంత వరకూ 67.83 శాతం పని పూర్తయిందని అన్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల సాగునీటి పథకం పనిని 2020 ఖరీఫ్ నాటికి పాక్షికంగా పూర్తి చేయాలని ప్రతిపాదించామని, 2021 ఖరీఫ్ నాటికి లక్ష ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టును కల్పించామని అన్నారు. ప్రాజెక్టుకు 3880 ఎకరాల భూమి అవసరమని, ఇంత వరకూ 1379 ఎకరాల భూమిని సేకరించామని, ఇంకా 2501 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఉదయ సముద్రం ఎత్తిపోతల సాగునీటి పథకం ప్రధాన పనులు పూర్తయ్యాయని, కాలువలు, పంపిణీ నెట్‌వర్కు వ్యవస్థ పురోగతిలో ఉందని తెలిపారు.
భారీగా ఉద్యోగాల నియామకాలు
తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో లక్షా 17వేల 714 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ మొత్తం 101 ప్రకటనలు ఇచ్చిందని, మిగిలిన ఏజన్సీల ద్వారా మరో 41 ప్రకటనలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందని అన్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి 900 కేసులు కోర్టుల్లో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్‌లో సంప్రదాయ వీధి దీపాల స్థానంలో అధిక ఇంధన సామర్ధ్యం ఉన్న ఎల్‌ఈడీ దీపాలను అమరుస్తున్నట్టు మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలేరు వెంకటేష్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రాంతంలోని 4,32,901 సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఇంధన సామర్ధ్య ఎల్‌ఈడీలను అమర్చామని, 2017 జూలై నుండి 2019 జూలై వరకూ సంచిత ఇంధన పొదుపు 152.96 కోట్ల రూపాయిల విలువైన 216.50 ఎంయులుగా నమోదైందని అన్నారు. అమర్చిన ఎల్‌ఈడీలను ఈఈఎన్‌ఎస్ నిర్వహిస్తోందని చెప్పారు.