తెలంగాణ

సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ ఇస్తే ఎందుకు బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, నిధుల కొరత లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడాన్ని ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించడం సరికాదన్నారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు కూడా ప్రజా ప్రతినిధులనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాటి ప్రజాప్రతినిధులకు చెక్‌పవర్ ఇవ్వడంపై రాద్ధాంతం తగదన్నారు. బుధవారం ఇక్కడ అసెంబ్లీలో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి పద్దులపై ఆయన బదులిస్తూ పంచాయతీ కార్యదర్శికి చెక్‌పవర్‌ను గతంలోనే రద్దు చేశామన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2714 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ప్రతి నెల పంచాయతీలకు రూ.339 కోట్లకు మంజూరు చేస్తామన్నారు. గ్రామీణ వికాసం కోసం రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆసరా పెన్షన్ల కింద రూ.9వేల 402 కోట్లను నిధులు కేటాయించామన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిషన్ భగీరథ కింద తాగునీటిసదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. దేశమంతా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రశంసిస్తోందని, కేంద్రంతోపాటు ఇతర రాష్టల్ర పాలకులు, అధికారులు కూడా మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకుంటున్నారన్నారు. 30రోజుల ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. నిధుల గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీపడరన్నారు.