తెలంగాణ

సహకార రంగ సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సహకార రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు ప్రశోత్తర కార్యక్రమంలో నల్లమోతు భాస్కరరావు, చల్లా ధర్మారెడ్డి, రవిశంకర్ సుంకెలు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటునిస్తుందని అన్నారు. భవిష్యత్‌లో విజయడెయిరీ విస్తరణకు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. డెయిరీ పాలతో పాటు మరిన్ని ఉత్పత్తులకు అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం విజయడెయిరీకి ప్రభుత్వం నాలుగు రూపాయిలు చొప్పున ప్రోత్సాహకం అందిస్తోందని చెప్పారు. కాగా ప్రోత్సాహకాలు ఆలస్యం కాగానే ఇస్తారా లేదా అనే సందేహాలు అక్కర్లేదని, డెయిరీల ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో 75 కోట్ల రూపాయిలు కేటాయిచామని పేర్కొన్నారు.
ప్రైవేటు డెయిరీలు కూడా ప్రోత్సాహకం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. విజయడెయిరీ, నల్లగొండ - రంగారెడ్డి డెయిరీ, కరీంనగర్ ముల్కనూర్ డెయిరీల్లో 2.13 లక్షల సభ్యులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం పాడి పశువుల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. విజయడెయిరీ విస్తరణ 2021-22 సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని అన్నారు. లాలాపేట పరిసరాల్లో ప్రతి రోజు ఐదు లక్షల లీటర్లు ఉత్పత్తి జరుగుతోందని, దీనిని ఎనిమిది లక్షల లీటర్లకు సామర్ధ్యానికి పెంచే ప్రయత్నం చేస్తున్నామని, నాబార్డు సాయంతో డిఐడిఎఫ్ పథకం కింద గ్రీన్ ఫీల్డు ఆధునిక పాడిపరిశ్రమ ప్లాంట్‌ను సమాఖ్య మద్దతుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.