తెలంగాణ

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: మానవ అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మానవ అక్రమ రవాణాపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సి చర్యలపై కఠినంగా ఉండాలన్నారు. మాయమాటలు చెబుతూ సహాయం చేస్తామని చెప్పి మభ్యపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు కొన్ని ముఠాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. బాధితులను రక్షించడంలో పోలీసులు స్వచ్ఛంద సంస్థల సకాకారాన్ని తీసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణా ఎలా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అనే అంశాన్ని ముందస్తుగా పోలీసులు గుర్తించాలన్నారు. మానవ అక్రమ రవాణాలో బాధితులు ఖండాంతరాలు దాటి రావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ సంపాదన కోసమే వ్యభిచారానికి అలవాటు పడుతున్నారన్నారు. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టినప్పుడే ఈ వ్యవస్థ ఫుల్‌స్టాప్ పడుతుందన్నారు. ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇటీవల అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఘటనలు ఉన్నాయన్నారు.