తెలంగాణ

ప్రాజెక్టుల కోసమే అప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రభుత్వం తెస్తున్న అప్పులు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్న తపనతోనే తప్ప మరే ఇతరత్రా అవసరాలకు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై రాద్దాంతాలు, నిందారోపణలు మానుకుని, వాటి నిర్మాణాలకు సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు హితవు పలికారు. ప్రభుత్వం చేసిన అప్పులను దుర్వినియోగం చేస్తోందని, అందుకే రాష్ట్రం అప్పులపాలు అవుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం ఎదురుదాడికి దిగారు. గురువారం శాసన సభలో సాగునీటి ప్రాజెక్టులపై నిధులు, నిర్మాణాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి జలాలు ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల్లోకి వస్తున్నాయని, దీనితో పరివాహక ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని సీఎం అన్నారు. మరో రెండేళ్లలో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు. దీంతో దాదాపు తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని ఆయన నొక్కి చెప్పారు. కాళేశ్వరంతో 44 లక్షలకు ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఒకవైపు గోదావరి, మరోవైపు కాళేశ్వరం నుంచి సాగునీరు ప్రవహిస్తుంటే, రైతులు ఆనందిస్తున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై లేనిపోని విమర్శలు చేశారని, అయితే ఆయన సొంత మండలంలోకి సాగునీటిని తీసుకురావడంతో విమర్శలను మానుకోవాల్సి వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. శ్రీరాంసాగర్‌కు గోదావరి జలాలను తీసుకురావడానికి మార్గాలను సోధించామన్నారు. తత్పలితంగా ప్రతిపాదనలు, మేధోమథనం చేశామన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టులు ఎత్తులో ఉన్నందున, సాగునీటిని తీసుకుపోవడానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనన్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి సింగూరు, నిజాంసాగర్‌కు సాగునీటిని తరలిస్తామన్నారు. మల్లన్న సాగర్ వద్ద టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల వినతిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతించారు. అందుకు ఖర్చు వివరాలపై నివేదికను అందిస్తే ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో కరవు పారద్రోళడానికి మల్లన్న సాగర్ సాగునీటిని తరలించాలన్న స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచించగా దుబ్బాక నియోజక వర్గంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నందున సాగనీటిని తరలించడానికి వీలైతుందన్నారు.
గని కార్మికులకు శుభవార్త
సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులకు దశరా పండుగ సందర్భంగా బోనస్ ఇస్తున్నట్లు కేసీఆర్ గురువారం శాసన సభలో ప్రకటించారు. సింగరేణిలో పని చేసే ప్రతి కార్మికునికీ లక్షా 899 రూపాయలను బోనస్‌గా అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి బొగ్గు గనులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పని చేయడంతో, గణనీయమైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు. తెలంగాణకు ఆవిర్భావంతో తర్వాత సింగరేణి ప్రగతి అద్భుతమన్నారు. అపారమైన ఖనిజ సంపదను వెలికి తీయడానకి కార్మికులు పడుతున్న శ్రమ వెలకట్టలేనిదన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కార్మికునికి 13.500 దక్కితే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కార్మికునికి ఒకలక్షా 899 రూపాయలు దక్కాయన్నారు.
కమాండ్ కంట్రోల్ వ్యవస్థ దేశానికి ఆదర్శం
హైదరాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూ 350 కోట్లతో వచ్చే డిసెంబర్ నాటికి
పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కేవలం పోలీస్ శాఖకే కాకుండా, వరదలు, విపత్తులు, ఉత్పాతాలు, కరవు వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో మారుమూల ప్రాంతల్లో జరిగే ఎలాంటి విపత్కర పరిస్థితులను క్షణాల్లో ఫొటోలతో సహా అందిస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను పరిశీలిస్తాం
ప్రజల భద్రత విషయంలో రేయింబవళ్లు పోలీసులు అప్రమత్తంగా ఉంటారని, వారికి సైతం వారానికి లేదా పది రోజులుకు ఒక సెలవును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అయితే, ఎప్పుడు అమలులోకి తీసుకువస్తామన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దేశంలో హోంగార్డులకు ఇచ్చే వేతనం దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. హోంగార్డులు పదవీ విరమణ వచ్చే సమయానికి కనీసం రూ. 50 వేల జీతం తీసుకుంటారని సీఎం గుర్తు చేశారు. ట్రాఫిక్ పోలీసుల విధులు వర్ణనాతీతమన్నారు. ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, దుమ్ము, దూళితో వారి ఊపిరితిత్తులు చెడిపోవడంతో అనారోగ్యానికి గురైతున్న సంఘటనలు చూస్తున్నామన్నారు. ఎక్కువ పని గంటలు చేస్తే ఫలితాలు రావన్నారు. పోలీస్ వ్యవస్థల్లో మార్పులుచేర్పులు తీసుకురావడానికి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని లండన్, అమెరికా పంపించానని చెప్పారు, సమగ్రమైన నివేదిక వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తానన్నారు. హైదరాబాద్‌లో పండుగలు వస్తే శాంతి భద్రతలు కాపాడడం కష్టంగా మారిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాలుగువైపులా భద్రతను పటిష్టం చేయడానకి నాలుగు హెలీకాప్టర్ దిగడానకి స్థలాను పరిశీలిస్తున్నామని సీఎం వెల్లడించారు.
**
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని, నీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకుందని విపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీలో వివరణాత్మక సమాధానాలిచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసమే అప్పులు తెచ్చామని స్పష్టం చేసిన ఆయన అవి పూర్తయతే రాష్ట్రం సస్యశ్యామలవుతుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక సూచనలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు నీటిని అందించడం ద్వారా విపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా చేశామని సీఎం తెలిపారు. సింగరేణి కార్మికుల గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు పడుతున్న కష్టం వెలలేనిదని అన్నారు. ప్రతి కార్మికుడికీ దసరా కానుకగా లక్ష రూపాయల బోనస్‌ను ఇస్తున్నామన్నారు. మొత్తం మీద సీఎం సుదీర్ఘ వివరణతో పలు ప్రశ్నలకు సమాధానం లభించింది.