తెలంగాణ

కోటి మందికి బతుకమ్మ చీరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అర్హులైన కోటి రెండు వేల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీకి శ్రీకారం చుడుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఈ చీరలను పొందడానికి అర్హులన్నారు. మాసాబ్ ట్యాంక్ సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్టవ్య్రాప్తంగా 18 ఏళ్లకు పైబడి, బతుకమ్మ చీరలు అందుకోవడానికి అర్హులైన వారు కోటి 2 వేల మంది మహిళలు ఉన్నట్టు గుర్తించామన్నారు. బతుకమ్మ చీరల కోసం రూ.313 కోట్లు ఖర్చు చేశామన్నారు. మహిళలు ఎంతో ప్రీతిపాత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సంవత్సరాలుగా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. బతుకమ్మ చీరల ద్వారా 16 వేల పవర్ లూమ్ కార్మికుల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే 26 వేల మరమగ్గాల ద్వారా బతుకమ్మ చీరలు తయారు చేశారన్నారు. ఈ ఏడాది 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగుల్లో మొత్తంగా 100 వెరైటీల చీరల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్
వివరించారు. ఇప్పటికే జిల్లాలకు చీరలను చేరవేశామన్నారు. మరమగ్గ కార్మికులకు గతంలో నెలకు రూ. 8 వేల నుంచి 12 వేల రూపాయలు మాత్రమే దక్కేందని బతుకమ్మ చీరల ద్వారా ఒక్కో కార్మికునికి నెలకు రూ. 16 వేల నుంచి 20 వేలు లభిస్తుందన్నారు. బతుకమ్మ చీరల కోసం గత మూడు సంవత్సరాల్లో రూ.715 కోట్లు కేటాయించామన్నారు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ, ఏటేటా డిజైన్లు, నాణ్యతను మరింతగా మెరుగు పరుస్తున్నామన్నారు. ఈసారి చీరతో పాటు జాకెట్ కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి, సెర్ఫ్ సీఇవో పౌసమి బసు, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...బతుకమ్మ చీరల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్