తెలంగాణ

వచ్చే జూన్ నాటికి కలెక్టరేట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత పరిపాల సౌలభ్యం కొరకు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు. ఈ కలెక్టరేట్లను కట్టడానకి ప్రభుత్వం రూ. 963 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టరేట్లు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. మెదక్ కలెక్టరేట్ నిర్మాణాలు ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే జరిగాయని, మిగతా 70 శాతం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియడంలేదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ మరో 9 నెలలు గడువు కోరినట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సమాధానం
చెబుతూ మెదక్‌లో కలెక్టరేట్‌ను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో కనీసం 600 మంది ఉద్యోగులు పని చేస్తారన్నారు. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడానికి దాదాపు 250 మంది ఉద్యోగులు కూర్చువడానికి సమావేశ హాలు ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన శాఖల ఉన్నతాధికారులు 50 మంది సమావేశం కావడానికి మరో హాలును ఏర్పాటు చేస్తామన్నారు. 2020 జూన్ నాటికి అన్ని జిల్లాల కలెక్టరేట్లను పూర్తి చేయడానకి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతాలన్నారు. నారాయణపేటలో త్వరలో కలెక్టరేట్‌కు భూమి కేటాయించిన అనంతరం పనులు చేపడతామమని అక్కడి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి మంత్రి హామీ ఇచ్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ అద్భుతంగా ఉందన్నారు. మరో నాలుగు నెలల్లో కనీసం 7-8 జిల్లాల్లో కలెక్టరేట్‌లు పూర్తి అవుతాయన్నారు.

*చిత్రం...రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి