తెలంగాణ

వాగు దాటలేక.. వైద్యం అందక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 19: బాహ్య ప్రపంచానికి ఆమడదూరంలో దుర్భర జీవనం సాగించే మారుమూల గిరిజన గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేక వర్షాకాలంలో మరో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయంది. ఇటీవలే బెజ్జూర్ మండలంలో నిండు గర్భిణీకి వైద్యం అందక పసిగుడ్డు మార్గమధ్యంలోనే మృతి చెందిన సంఘటన మర్చిపోక ముందే, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం మారుమూల గుబిడి గ్రామానికి చెందిన పదేళ్ళ గిరిజన బాలిక వౌనిక సకాలంలో వైద్యం అందక మృతి చెందింది. ఈ సంఘటన ఆ కుటుంబంలోనేకాదు.. గిరిజన గ్రామాల్లోనూ తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మహారాష్టక్రు సరిహద్దులో ఉన్న భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన పెందూరి వౌనిక (10) విష జ్వరంతో ఐదు రోజులుగా మంచం పట్టింది. బుధవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆమెను మంచంపై పడుకోబెట్టి, కాలి నడకన కరంజికి బయల్దేరారు. మార్గమధ్యంలోని గుబిడి వాగు భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించడంతో మూడు గంటల పాటు వాగు పక్కనే వరద తగ్గేంతవరకు
కూర్చున్నారు. రాత్రి రెండు గంటల సమయంలో వరద కాస్త నెమ్మదించడంతో మోకాలి మట్టం నీటిలో వాగు దాటి కరంజికి వచ్చి, ఆ తర్వాత ఓ వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయతే, అప్పటికే, పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో కన్నుమూసింది. తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ చిన్నారి మృతికి నాయకులు, అధికారు ల నిర్లక్ష్య వైఖరే కారణమని స్థానికులు మండిపడుతు న్నారు. గుబిడి వద్ద గల వాగుపై వంతెన నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని దశాబ్దకాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్ళుఅరిగెలా తిరిగినా కనికరించడం లేదని ధ్వజ మెత్తుతున్నా రు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వంతెన నిర్మిస్తేనే ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు తీర్మానించడంతో కలెక్టర్ దివ్య వెంటనే వెళ్ళి గ్రామస్తులకు నచ్చజెప్పి వంతెన ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో సైతం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ గ్రామం దుస్థితి వివరిస్తూ 8 కిలో మీటర్ల రోడ్డుతో పాటు వంతెన నిర్మించాలని, ప్రజలు తమను నిలదీస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే భారీ వర్షం, వరద ఉధృతికి వాగు దాటలేక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన గ్రామస్తుల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. సకాలంలో వైద్యం అంది వుంటే వౌనిక ప్రాణాలు దక్కేవని డాక్టర్లు పేర్కొనడం గమనార్హం. వర్షాకాలంలో వాగులు మృత్యుకుహారాగా మారుతున్నాయని, మారుమూల గిరిజన గ్రామాల రవాణా సౌకర్యం, వైద్యం అందించాలని గిరిజనులు కోరుతున్నారు.

*చిత్రాలు.. చిన్నారి వౌనికను మంచంపై మోస్తూ వాగు దాటిస్తున్న గ్రామస్తులు

*మృతి చెందిన వౌనిక (ఇన్‌సెట్‌లో)