తెలంగాణ

జనగామపై పోలీసుల ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 9: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలని కొనసాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటుంది. ఉద్య మం ఒకవైపు ఊపందుకుంటున్నా పోలీసులు మరోవైపు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే దాదాపు 60కేసులు నమోదు చేసిన పోలీసులు 22మందిని రిమాండ్‌కు తరలించారు. జిల్లా సాధన ఐకాస చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి సహా కీలక నాయకులంతా ఇంకా జైల్లోనే ఉన్నారు. మరికొంత మందిపై కేసులు నమోదై అరెస్టుకు సిద్ధం చేశారు. పోలీసుల అరెస్టులతో ఉద్యమకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యమ సందర్భంగా వరంగల్ -హైద్రాబాద్ జాతీయ రహదారి దిగ్బందం చేసేందుకై పాఠశాలల విద్యార్ధులను రోడ్లపైకి తీసుకొచ్చి రాస్తారోకో చేయించారన్న కారణంగా ఆరు ప్రయివేటు విద్యాసంస్థల యజమానులపై కేసులు నమోదు చేసారు. రోజురోజుకు ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉద్యమకారులపై బలమైన కేసులు పెడుతుండటంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు సైతం జంకుతున్నారు. మరోవైపు గత పదిరోజులుగా జనగామ పట్టణంలో పోలీసులు 144సెక్షన్‌ను అమలు చేసారు. అయినప్పటికీ ప్రజలే శుక్రవారం జరిగిన బంద్‌ను స్వచ్చందంగా పాటించి విజయవంతం చేశారు. మారుమూలల్లో కూడా పూర్తిగా బంద్ పాటించి జనగామ జిల్లా ఏర్పాటు ఆకాంక్షను చాటిచెప్పారు. ఇదిలా కొనసాగుతున్నప్పటికీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వైఖరిపై జెఎసి నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో తమతో కలిసిరాకుండా ఉండటం పట్ల ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిపై జెఎసి నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల వెంట ఉండి ఉద్యమాన్ని నడిపించాల్సిన ఎమ్మెల్యే మొహం చాటేయడంతో ఇక జిల్లా ఏర్పాటు ఎలా అవుతుందని వారంటున్నారు. జిల్లా సాధన ఏర్పాటు ఆందోళన నేపథ్యంలో దాదాపు నెల రోజులుగా జనగామకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దూరంగా ఉన్నారు. జనగామ జిల్లా ఏర్పాటుకు ఎంపి బూరనర్సయ్యగౌతో పాటు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య, జిల్లాకు చెందిన డిప్యూటి సిఎం కడియం శ్రీహరి కూడా చొరవతీసుకోకపోతుండటంతో జనగామ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్న చేర్యాల, మద్దూరు మండలాలు సిద్దిపేటలో కలుస్తాయని అక్కడి ప్రజలు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు అందచేసారు. కాగా ఈమండలాలను సిద్దిపేటలో చేర్చుకునేందుకు మంత్రి హరీష్‌రావు వెనుక నుండి మంత్రాగం నడిపించాడని జిల్లా సాధన సమితి నాయకులు అనుమానిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం జనగామ జిల్లా ఏర్పాటు అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం.. జనగామ జిల్లా ఏర్పాటు కోరుతూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు