తెలంగాణ

కొత్త పరిశ్రమల జాడేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, వాస్తవంగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శుక్రవారం శాసన సభలో కార్మిక శాఖ పద్దుల చర్చల్లో పాల్గొన్న భట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అంటూ సర్కారును నిలదీశారు. సింగరేణి బొగ్గు గనుల్లో కారుణ్య నియామకాలు అరకొరగా చేస్తున్నారని, వేలాది కుటుంబాల్లో పెద్దదిక్కులేకపోవడంతో పరిస్థితి వర్ణనాతీతంగా మారిందన్నారు. సింగరేణిపై మరింత సమాచారం చెబుతానని భట్టి అంటుండగా, అధికార పక్షం పదేపదే అడ్డుపడింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలుగచేసుకుని సింగరేణి అంశంపై మాట్లాడితే గొడవ పెరుగుతుందని, కాబట్టి మరేదైనా అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీనికి భట్టి స్పంది స్తూ ‘మీరు వద్దంటే సింగరేణిపై చర్చను ముగిస్తాను’ అన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాల అంశాలపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే, నవ్వులపాలు అవుతారని ప్రభుత్వానికి చరకలంటించారు. కొలువులు వస్తాయని ఉద్యమం సమయంలో పోరాడిన నేతలు నేడు కొలువుల అంశం లేవనెత్తితే సమాధానం చెప్పలేకపోతున్నారని భట్టి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మెట్రోరైలు టికెట్ల ధరలు తక్కువ ఉండాలని ఆనాడు కాంగ్రెస్ సూచించిందని గుర్తుచేశారు. నేడు మెట్రోరైల్లో సామాన్యుడు ప్రయాణించే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష
తలు మాట్లాడుతుంటే, అధికార పక్షం నేతలు రన్నింగ్ కామెంటరీ చేయడం ఏమిటని భట్టి నిలదీశారు. ‘సభా
సాంప్రదాయాంటూ ఏమీ లేవా అధ్యక్ష్యా’ అంటూ భట్టి స్పీకర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి నిజంగానే జరిగిందా? ఒకవేళ జరిగితే వాటికి లెక్కలు చెప్పగలరా? అంటూ భట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే ఆర్థిక మాంద్యం పేరు చెప్పి సమాధానం ఇవ్వకుండా, దాటవేత ధోరణిని వ్యవహరిస్తోందన్నారు. యాదగరి గుట్టలో శిల్పాలు, ఇతర బొమ్మల గురించి భట్టి మాట్లాడుతుంటే అధికార తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. యాదగరి గుట్ట పేరు చెబితేనే ఎందుకు గించుకుంటారని భట్టి ప్రతిదాడికి దిగారు. దీంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఈ స్థితిలో స్పీకర్ స్పందిస్తూ, అధికార పక్ష సభ్యులు సమ్యమనం పాటించాలని స్పీకర్ సూచించారు. కాగా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భారీ పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసినవేనని భట్టి గుర్తు చేశారు. పట్టణాల్లో పరిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కొత్త టెక్నాలజీను ఏమైనా తీసుకువచ్చారా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులు అనేక సందర్భాల్లో దుర్వాసన, పేరుకుపోయిన గ్యాస్ కారణంగా పడుతున్నారని, వారి కుటుంబాలు వీధులపాలైతున్నాయని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ పద్దులపై చర్చలు జరుగుతున్న సమయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు శాసన సభలో లేకపోవడం చర్చనీయాంశమైంది. అధికారలు గైర్హాజరు కావడం పట్ల భట్టి అంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న కార్మిక శాఖ పనితీరుపై చర్చలు జరుగుతున్నప్పుడు సభలో అధికారులు లేకపోవడాన్ని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఉద్యోగాలు, పరిశ్రమలపై అధ్యయనం అంటూ విదేశాలకు వెళ్లి, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఆచరణలో సాధించింది సున్నా’ అని కేటీఆర్‌వైపుచూస్తూ భట్టి వ్యాఖ్యానించారు. పరిస్థితిని గమనించిన స్పీకర్ ఆయనను అడ్డుకొని సమయాతీతం అవుతున్నదని అన్నారు. ‘ప్రతిపక్ష నేతలకు 15 నిమిషాలు, అధికార పక్షానికి గంటల సమయం ఇస్తారా అధ్యక్ష్యా’ అని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భట్టి చర్చను ముగించారు.