తెలంగాణ

విలపించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు ఎమ్మెల్యే (టీఆర్‌ఎస్) గొంగిడి సునీత శుక్రవారం నిండు శాసనసభలో విలపించారు. మనసులో ఉన్న బాధ తట్టుకోలేక ఏడ్చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో డయాలసిస్ కేంద్రాలకు సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, తన తండ్రి 14 సంవత్సరాల పాటు డయాలసిస్ చేయించుకున్నారని గుర్తు చేసుకున్నారు. తమది సామాన్య కుటుంబం కావడంతో, ఆర్థికంగా కూడా ఇబ్బందులు తలెత్తాయన్నారు. తన తండ్రి డయాలసిస్ కోసం హైదరాబాద్‌కు తరచూ వచ్చేవారని, ఆయనతో పాటు తమ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వస్తుండేవారమన్నారు. 14 సంవత్సరాల పాటు చికిత్స తర్వాత తన తండ్రి మరణించారని అన్నారు. తండ్రి మరణం గురించి
చెబుతున్న సమయంలో ఆమె భోరున విలపించారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక విలపించడంతో కొన్ని క్షణాల పాటు సభ అంతా స్తబ్దుగా, గంభీరంగా మారింది. పక్కనున్న ఎమ్మెల్యేలు ఆమెను ఓదార్చాల్సి వచ్చింది. సభ యావత్తూ సునీతకు అండగా నిలిచింది.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటూ కలుషిత నీరు, ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల డయాలసిస్ వస్తుందని తేలిందన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ చేపట్టిందని, ఈ పథకం అన్ని గ్రామాల్లో అమలయ్యేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఫుడ్ మ్యాప్
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘్ఫడ్ మ్యాప్’ తయారు చేసిందని పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు. పెద్ద సుదర్శన్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఏఏ ప్రాంతాల్లో ఏఏ పంటలు పండుతున్నాయో అధ్యయనం చేశామని, ఈ పంటలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
బియ్యం బదులు డబ్బు ఇవ్వలేం
రేషన్ బియ్యం బదులు సబ్సిడీ మేరకు డబ్బులను ఇవ్వడం కుదరదని చల్ల ధర్మారెడ్డి చేసిన సూచనకు స్పందిస్తూ పౌరసరఫరాల మంత్రి గంగు కమలాకర్ స్పష్టం చేశారు. ఆహార భద్రత కింద సబ్సిడీపై బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే 106 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, మరో 141 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేపీ వివేకానంద తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జౌళి, టెక్స్‌టైల్, హ్యాండ్లూం పార్కులు ఏర్పాటు చేస్తామని నరేందర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాల్లో 114 కోట్ల రూపాయల అంచనాతో 7,595 డంపింగ్ యార్డులను మంజూరు చేశామని గువ్వల బాలరాజు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.