తెలంగాణ

డయాలసిస్ రోగులకు పింఛన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: డయాలసిస్ రోగులకు పింఛన్ ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో బిగాల గణేశ్, కంచర్ల భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, డయాలసిస్ రోగులు అనేక అవస్థలు పడుతున్నారని అంగీకరించారు. వీరికి పింఛన్ ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ అంశంపై సభ్యులు జరిపిన చర్చవల్ల డయాలసిస్ తీవ్రత ఎలా ఉందో తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 43 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 270 మిషన్లు
ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం సీహెచ్‌సీ ఆర్మూర్, సీహెచ్‌సీ కోరుట్ల, ఏహెచ్ హుజూరాబాద్, జీసీడి కామాటిపురాలలో కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. డయాలసిస్ పేషంట్లు ప్రతి నెలా 10 సార్లు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, 1,50,000 రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించారు. ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఇప్పటికే వీరికి బస్‌పాస్‌లు ఇచ్చామన్నారు. గత ఏడాది ఇందుకోసం 33.29 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ఈ సంవత్సరం కూడా అవసరమైన మేరకు నిధులు కేటాయించామని వివరించారు. డాక్టర్ ఆనంద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీగా గణేశ్, వీఎం అబ్రహహం కూడా డయాలసిస్‌పై మాట్లాడారు.