తెలంగాణ

జోరందుకున్న సేద్యం ఆనందం కలిగిస్తున్న వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు బాగానే ఉండటంతో సేద్యం జోరుగా సాగుతోంది. రాష్ట్రం మొత్తంలో 115 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం 50 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. విత్తనాలు వేయడం ఈ నెల చివరి వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో వరినారుమళ్లు కూడా ప్రారంభమయ్యాయి. చెరువులు, కుంటలు, బావుల కింద వరిసాగు మొదలైంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా జొన్న, మొక్కజొన్న, కందులు, ఆముదాలు, సజ్జ, రాగులు తదితర మెట్టపంటలు వేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాల్లోని వ్యవసాయ సంయుక్త డైరెక్టర్ (జెడిఎ) ల నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జిడి ప్రియదర్శిని ప్రతిరోజూ సమాచారం తెప్పించుకుంటోంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి కూడా ఈ అంశంపై ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ పరంగా 5.60 లక్షల క్వింటాళ్ల విత్తనానలు రైతులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుల పెట్టుబడులు తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం విత్తనాల పంపిణీ పూర్తయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.