తెలంగాణ

క్రియాశీలకంగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రెండు వారాల పాటు కొనసాగనున్న హరితహారం కార్యక్రమంలో కలెక్టర్లు క్రియాశీలకంగా పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రజా ప్రతినిధులు అందరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజా ఉద్యమంగా నడిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొని మొక్కలు నాటాలన్నారు. ఆయా జిల్లాల్లో ప్రతీ రోజు జరిగే హరితహారంపై తన కార్యాలయానికి నివేదికలు పంపించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటడంతో పాటు వాటిని పర్యవేక్షించడానికి అవసరమైన వ్యూహం రూపొందించుకోవాలని అన్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రహదారుల వెంట, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, ఖాళీ ప్రదేశాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలని అవగాహన పెంచడానికి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.