తెలంగాణ

నిండుకుండలా కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: బిరబిరా కృష్ణమ్మ పరుగులీడుతుంటే ఆ అందాలను తిలకించాలని అందరికీ ఉంటుంది. ఈ ఏడాది మొదట్లో వర్షాలు అంతతంగానే ఉండటం దాంతో ఓ సమయంలో వర్షాకాలంలో సైతం కృష్ణానది వట్టిపోయిన దృశ్యాలు కూడా కనబడ్డాయి. అయితే ఒక్కసారి కర్నాటక, మహారాష్టల్రో వరుణుడు కనికరించారు. భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. అంతే ఆల్మట్టికి వరద రావడం దాంతో ఆల్మట్టి నిండడంతో దాని దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు సైతం నిండి జూరాలకు పరుగులు తీసింది. జూరాల నుండి కూడా కృష్ణమ్మ పరవళ్లు శ్రీశైలం మల్లికార్జునిడి చెంతకు చేరి పాతాళగంగ పైకి ఉబికివచ్చింది. దాంతో వందల కిలోమీటర్ల పొడవునా కృష్ణవేణి అందాలు చూడముచ్చటగా మారాయి. నెల రోజుల వ్యవధిలో కృష్ణానది మూడు సార్లు వరద వచ్చింది. ప్రస్తుతం జూరాల పాజెక్టుకు సంబంధించిన ఏడు గేట్లు ఎత్తివేయగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లు ఎత్తివేశారు. దాంతో పాతాళగంగ నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే తంగిడి క్రిష్ణ నుండి వందల కిలోమీటర్లు శ్రీశైలం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని కృష్ణ పుష్కరఘాట్లన్నీ వరదతో నీట మునిగాయి.
ప్రస్తుతం కృష్ణానది నిండుకుండలా ప్రవహిస్తోంది. దాంతో కృష్ణానది అందాలను తిలకించేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు కృష్ణానది అందాలను చూసేందుకు తరలివస్తున్నారు. దాంతో కృష్ణానది తీరాన గల దేవాలయాలకు భక్తుల తాకిడి సైతం మొదలైంది.
సెప్టెంబర్ మాసంలో కృష్ణానది పరవళ్లు తొక్కితే ప్రస్తుతం ఖరీఫ్ పంటలతో పాటు, వచ్చే రబీ సీజన్‌కు కూడా ఇక ఢోకాలేదంటున్నారు రైతాంగం. జూరాల కుడి ఎడమ కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేయడంతో ప్రాజెక్టు కింద సాగు జోరుగా కొనసాగింది. ఇప్పటికే వరినాట్లు వేసి కలుపు వరకు వచ్చాయి. కలుపు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కోయిల్‌సాగర్, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల మోటర్లు సైతం నిరంతరంగా నడుస్తున్నాయి. జూరాల అనుసంధానంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీటిని ఎత్తిపోస్తున్నారు. అదేవిధంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌కు అనుసంధానంగా గల కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లు నడుస్తుండడంతో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు నుండి కృష్ణాజలాలు చెరువులు. కుంటల్లోకి వచ్చి చేరుతున్నాయి. కాగా ఈ ఏడాది పలు ప్రాజెక్టుల ద్వారా పంటల సాగు అధికంగానే ఉంది. కృష్ణానది వరద ఖరీఫ్ పంటలకు అనుకూలంగా రావడంతో ఆయకట్టు రైతులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా నది ప్రవాహం 2009లో వచ్చిన తరహాలో ప్రస్తుతం ప్రవాహిస్తుంది. గత పదిహేను రోజుల క్రితం వచ్చిన వరద అప్పట్లో వచ్చింది. ఏకంగా ఆరులక్షల కూసెక్కుల వరద రావడం చూసి నది తీరా ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నది ప్రవాహం మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టులు మాత్రం నిండిపోయాయి. వరద తరుచూ వస్తుండడంతో ప్రాజెక్టుల గేట్లు కూడా తరుచూ ఎత్తివేస్తుండడం కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది.