తెలంగాణ

కేసీఆర్ మంత్రి వర్గంలో లోపించిన సామాజిక న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 20: కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని విస్మరించారని, దళితులు, బీసీల పట్ల తీవ్ర వివక్ష పాటించారని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రివర్గ విస్తరణలో దళితులకు తీవ్రస్థాయిలో అన్యాయం చేశారని అన్నారు. సుమారు 15 శాతం జనాభా ఉన్న దళిత సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు రావాల్సి ఉండగా కేవలం ఒక్కటి ఇచ్చారని అన్నారు. ఇక జనాభాలో 50 శాతం ఉన్న బీసీలను సైతం ముఖ్యమంత్రి మోసగించారని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర జనాభా ప్రాతిపాదికన కాని, కులాల వారీగా చట్టసభలకు ఎన్నికైన సభ్యుల ఆధారంగా కాని జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గం నుంచి కేవలం కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం కల్పించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ గతంలో ఉన్న డిప్యూటీ సీఎం పదవిని కూడా ఈసారి ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌తో కలిపి మొత్తం 18 మంత్రి పదవులు ఉండగా మిగిలిన సామాజిక వర్గాలకు ఒకొక్కటి చొప్పున కేటాయించి వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు పది మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారని నిలదీశారు. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గం ముఖ్యమంత్రిపై తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గాన్ని రద్దు చేసి అందరికీ న్యాయం చేసేలా తిరిగి మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో అర శాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి నాలుగు, రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఏ లెక్కన ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రేమతో వెలమ సామాజిక వర్గానికి, భయంతో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన కేసీఆర్ మిగిలిన వర్గాల పట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శించారని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 22న వరంగల్ కేడీసీ గ్రౌండ్‌లో వేలాది మందితో ఆవేదన మహాదీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే అన్ని సామాజిక వర్గాల కోసం హైదరాబాద్ నగరంలో దీక్ష చేపడతామని తెలిపారు.