తెలంగాణ

చిన్నారి రమ్యకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెం దిన చిన్నారి రమ్య భౌతికకాయానికి ఆదివారం గోల్నాకలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈనెల ఒకటిన పంజగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమ్య తొమ్మిది రోజులపాటు కోమాలోకెళ్లి శనివారం రాత్రి మృతి చెందిన విషయం విదితమే. కాగా ఆదివారం ఉదయం రమ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోస్టుమార్టానికి తరలించే ముందు రమ్య తల్లి రాధికను కడచూపు కోసం అవకాశం ఇచ్చారు. దీంతో రమ్యతల్లి బోరున విలపిస్తూ సొమ్మసిల్లిపోయింది. రమ్య బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు సకాలంలో స్పందించలేదని, నాలుగు గంటలపాటు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా అబ్జర్వేషన్ పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. వెంటనే మెరుగైన వైద్యం అందించి ఉంటే రమ్య బతికి ఉండేదని వైద్యులపై మండిపడ్డారు. రమ్య మృతికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అంబర్‌పేటలో విషాదఛాయలు
ఉస్మానియాలో పోస్టుమార్టం అనంతరం రమ్య మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. అంబర్‌పేట డిడి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మా కంటి దీపం..మా కళ్లముందే ఆరిపోయిందంటూ తండ్రి బోరున విలపించారు. కాగా ఇదే రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమ్య తాత సురేంద్రనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
మంత్రుల నివాళి
రమ్య మృతదేహం వద్ద తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్‌పేట ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఐటి మంత్రి తారకరామారావు ట్విట్టర్‌లో రమ్య మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్నారి మృతి బాధాకరం
పంజగుట్టలో రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని, చిన్నారి రమ్య మృతి బాధాకరమని వెస్ట్‌జోన్ డిసిపి ఎ వెంకటేశ్వరరావు అన్నారు. మద్యం తాగి కారు నడిపిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వారికి జైలుశిక్ష పడేలా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని, నిందితుడు శ్రావిల్ రిమాండ్‌లో ఉన్నాడని డిసిపి చెప్పారు. పోలీస్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.
సెక్షన్ 304(2) కింద కేసు
మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారకుడైన షాహిల్‌పై సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశామని నగర కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు.
ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సిసి ఫుటేజీలను పరిశీలించి సాంకేతికపరమైన సాక్ష్యాలను సేకరించామన్నారు. నేరం రుజువైతే నిందితులకు పదేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. 21ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మడం, బార్‌లోకి అనుమతించొద్దని ఎక్సైజ్ శాఖాధికారులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.
మీడియా ప్రతినిధులపై ఆగ్రహం
‘పుట్టెడు దుఖంతో ఉన్నాం.. మమ్మల్ని కాదు మీరు అడిగేది? ధనమదంతో తప్పతాగి ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అడగండి.. వాళ్లు ఆ పిల్లలను కన్నందుకు సిగ్గు పడేలా చెయ్యండి. వాళ్లు రోడ్డుపై కనిపించినప్పుడల్లా ప్రజలు అసహ్యంగా చూస్తుంటే తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకునేలా చెయ్యండి.. ఆ హంతకులు తాగుబోతులని.. తాగుబోతులకు కారు ఇచ్చి తిరగమన్న వారిని ప్రజలకు పరిచయం చెయ్యండి..’ అంటూ రమ్య తల్లి రాధిక తన కూతురు మృతదేహం చూసి మూగగా రోదిస్తుండగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆమె నోటి ముందు గొట్టం (లోగో) పెట్టి ప్రశ్నిస్తుండగా రాధికతో పాటు ఆమె భర్త భావోద్వేగానికి గురై మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్నలు వేశారు. మీడియా ప్రతినిధుల తీరు పట్ల పలువురు విస్తుపోయారు. ప్రమాదానికి కారకులైన నిందితులను టివిల్లో చూపాలని, వారిని కాలేజీల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరి ప్రాణాలు బలిగొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటి వరకూ కనీసం పరామర్శించకపోవడం సిగ్గుచేటని రమ్య బంధువులు నిశితంగా విమర్శించారు.