తెలంగాణ

24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలోని తెలంగాణ ఆడపడుచులకు కోటి 2లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్ టీ. పద్మారావు, మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. బతుకమ్మ చీరల పంపిణీ విషయంపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రంత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు తలసాని, అలీ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుంచి ఈ చీరల పంపిణీ మొదలై, ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతోందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో 24న కనీసం రెండు వేల మందికి చీరలను పంపిణీ చేసేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చీరల పంపిణీకి ఎక్కువ సంఖ్యలో లబ్దిదారులు వచ్చే అవకాశమున్నందున, పంపిణీకి అనుకూలంగాన్న కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాళ్లను ఎంపిక చేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్టవ్య్రాప్తంగా కోటి 2లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు,వీటిని 18 ఏళ్లు దాటి, తెల్లరేషన్‌కార్డు కల్గిన వారికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 15లక్షల 40వేల చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 10 కలర్స్, 10 డిజైన్లతో ఈ చీరలను తయారు చేసినట్లు తెలిపారు. డివిజన్లు, సర్కిల్‌ళ్ల వారీగా చీరల పంపిణీ చేయటం జరుగుతుందని, 24వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో, పది గంటలకు అమీర్‌పేట డివిజన్‌లోని వివేకానంద కమ్యూనిటీ హాల్‌లో ఈ చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు.
పదకొండుగంటలకు అంబర్‌పేట, 12 గంటలకు గోషామహల్ నియోజకవర్గాల్లో చీరల పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. పాతబస్తీలోని వివిధ నియోజకవర్గాల్లో హోం మంత్రి మహమూద్ అలీ, సికిందరాబాద్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఈ చీరల పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు. చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని సూచించారు.
పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
ఈ నెల 23 నుండి శాసనసభ నియోజకవర్గాల కేంద్రాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. వివిధ అంశాలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్లతో శనివారం ఆయన బీఆర్‌కే భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలని సూచించారు. ఇప్పటికే 74 లక్షల చీరలను జిల్లాలకు పంపించామని చేనేత కమిషనర్ శైలజా రామయ్యర్ తెలిపారు. వీటిని వార్డుస్థాయి, గ్రామ స్థాయిలో కమిటీల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. అన్ని గ్రామాల్లో యూరియా అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు సమర్థతగా పనిచేసేలా చూడాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆదేశించారు. సీజనల్ జ్వరాలను నివారిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వివిధ రకాల జ్వరాలు సోకిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోలన్నారు. 2012 జనాభా లెక్కల గణన కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీ భూములను గుర్తించేందుకు సర్వే చేసి వివరాలను సంబంధిత పోర్టల్‌లో పెట్టాలని సూచించారు.

*చిత్రం...బతుకమ్మ చీరల పంపిణీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తదితరులు