తెలంగాణ

పేదల పొట్టగొట్టే ప్రాజెక్టులెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, జూలై 10: మెదక్ జిల్లాలో చేపట్టనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 16 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ప్రజలు జీవనోపాధి హక్కు, జీవించే హక్కు కోల్పోనున్నారని, దీనికంతటికీ ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలే కారణమని పౌరహక్కుల సంఘం నేతలు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌పై తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్యయన నిమిత్తం ఈ నెల 9, 10 రెండ్రోజులు భూ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి సేకరించిన వివరాలు ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి నిజనిర్థారణ నివేదిక అంశాలు వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తొగుట, కొండపాక మండలాల్లోని 16 గ్రామాల ప్రజలు జీవనాధారం పోతుందన్నారు. ఇప్పటివరకు డిపిఆర్ ప్రవేశపెట్టలేదని అన్నారు. ప్రజలతో అధికారులు చర్చించకుండానే జిఓ 123 ద్వారా ప్రభుత్వం బెదిరింపులు కొనసాగిస్తోందన్నారు.
రైతులు వ్యక్తిగత అవసరాల మేరకు అమ్ముకుంటున్నారని ప్రభుత్వం తప్పుడు పద్ధతులతో భూసేకరణ సేకరిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడ ఏ నది ప్రవాహానికి 50 టిఎంసిల ప్రాజెక్టు కట్టలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరూ వద్దనరు, కానీ ఇంత పెద్ద సామర్థ్యం ప్రాజెక్టు ఒకేచోట నిర్మించే బదులు అక్కడక్కడ చిన్నచిన్న సామర్థ్యం గల ప్రాజెక్టులు కట్టాలని వారు సూచించారు. ప్రభుత్వం వెంటనే మల్లన్నసాగర్ ప్రాజెక్టు డిపిఆర్ బహిర్గతం చేయాలన్నారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్, సాదాబైనామాలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేయించి ప్రత్యామ్నాయ నిర్మాణం చేయించి ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు భూపతి, బాలయ్య, ఎవిజి ప్రసాద్, సురేష్, రంజిత్, ప్రవీణ్, రవీందర్, నాగరాజు, వినోద్, పురుషోత్తం, లక్ష్మణ్, రవి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పౌరహక్కుల సంఘం నేతలు