తెలంగాణ

తెలంగాణ చరిత్ర తరగని గని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 22: వేలాది సంవత్సరాలుగా తిరగేసినా తరగని గని లాంటి చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గత మూడు రోజులుగా కరీంనగర్‌లో జరుగుతున్న తెలంగాణ వైభవం కార్యక్రమంలో ఆదివారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విదేశీ, వలస పాలనలో మన సంస్కృతిపై లెక్కలేనన్నీ దాడులు జరిగాయని, పూడ్చుకోలేనంత నష్టం జరిగినా ఓర్చుకున్న పుణ్యభూమి మనదేనన్నారు. ప్రజలెన్ని బాధలు అనుభవించినా బయటకు చెప్పుకోలేదని, సిరియా వంటి దేశాల్లో స్ర్తిలపై జరుగుతున్న అకృత్యాలు వింటున్నామని తెలంగాణలో కూడా ఇలాంటి అకృత్యాలెన్నో ప్రజలపై జరిగాయని అన్నారు. రామప్ప వంటి ఆలయాలు అద్భుత శిల్ప కళల విధ్వంసం, నేలమట్టమైన కోటలు, రాజమందిరాలు మనకు సాక్షమని, పూర్వీకులు ఇక్కడి నుండి వలసలు వెళ్లారన్నారు. 500 ఏళ్ల చరిత్ర తెలంగాణకు ఉన్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయని, ఇనుము పనిముట్లు, కత్తులు, ఆయుధాల తయారీ, 400 ఏళ్ల క్రితంవి పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికాయని, శతాబ్ధాలు పాలించినా రాజవంశాలు ఆ ఘనత మరింత పెంపొందించారని, శాతవాహనులు, వాకటకాలు, రాష్టక్రూటులు, చాళుక్యులు ఇక్కడ రాజ్యమేలారని, ఎలగందుల సమీపంలో కోటిలింగాల,కాకతీయ సామ్రాజ్యం గణపతి దేవుడు ఏనుగులపై ఆహారపదార్థాలు పంపించి ప్రజలను కరవు నుంచి కాపాడారన్నారు. 30ఏళ్ల స్థిరమైన పాలన అందించి రాణిరుద్రమ దేవి భారతదేశచరిత్రలో మొదటి రాజ్యాధినేతగా నిలిచి వీరమరణం పొందారని అన్నారు. ప్రతాపరుద్రుడు 40 ఏళ్లు పాలించగా,ఆ తరువాత అక్కన్న, మాదన్న, రామదాసు తెలంగాణ సంస్కృతి కాపాడారన్నారు. సాహిత్యంలో బమ్మెరపోతన, మల్లినాథ సూరి, పాల్కురికి సోమనాథుడు, కంచెర్ల గోపన్న, జగన్నాథ పండిత రాయలు, మల్లియ రేచన్న, గోన బుద్దారెడ్డి మొదలైన కవులు ప్రపంచానికి మన చరిత్ర చాటిచెప్పారన్నారు. తెలుగు భాషకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిన నేల మనదని భక్త రామదాసు భద్రాచలంలో దివ్యమైన ఆలయాన్ని నిర్మించి కీర్తనలు, గీతాలతో ప్రజల ఆదరణ పొందారన్నారు. తెలంగాణ గడ్డలో శైవం, వైష్ణవం, శాక్తం, జైనం, బౌద్ధం ఇంకా ఎన్నో మతాలు ఉన్నత శిఖరాలు చేరాయని, యాదగిరి నారసింహుడు, భద్రగిరి రాముడు, రామప్ప, అలంపూర్, కాళేశ్వరం, వేములవాడ, బాసర,్భద్రకాళి, కొలనుపాక, నాగార్జున కొండ ఇలా అన్నీ మతాలు శాంతి సామరస్యంతో జీవించిన గొప్ప నేల ఇది అని తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో వందల ఏళ్లుగా సమ్మక్క - సారలమ్మ జాతర ప్రపంచ రికార్డే, 70 వేల దేశాల జనాభా నాగోబజాతర కొమురవెల్లి మల్లన్న, ఏడు పాయల బోనాలు తెలంగాణ సంస్కృతి విశిష్టత గుర్తు చేస్తాయన్నారు. హైదరాబాద్‌కు భాగ్యనగరం అనే పేరు ఊర్కేరాలేదని, వజ్ర వైడ్యూరాలన్నీ విదేశీయులు కొల్లగొట్టుకుపోయారని బ్రిటీష్ రాజుల దగ్గర కోహినూర్ వజ్రం వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి దోచుకున్నదేనని, నూర్-ఆల్-ఐసి, దరియా-ఏ-నూర్ వెలకట్టలేని వజ్రాలను మన నేల పోగొట్టుకుందన్నారు. ఖనిజ సంపద నాణ్యమైన ముత్యాలకు, వజ్రాలకు, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల చేనేత వస్త్రాలు దేశమంతా ప్రసిద్ధి అని, అగ్గిపెట్టెలో, ఉంగరంలో పట్టే చీరలు నేసిన కార్మికులను కన్న గడ్డ ఇదన్నారు. రామప్పలో అప్పటి వస్తధ్రారణ, నాటి డిజైన్లు, అలంకరణలు, పూర్వీకుల వస్తర్రంగంలో పురోగతి సాధించారన్నారు. ఇంత గొప్ప సంస్కృతి నాశనం చేసి ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే రజాకార్ల కుట్రలు తిప్పికొట్టి భారత్‌లో విలీనమై సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్ల రాక్షసత్వాన్ని అణచి నిజమైన స్వాతంత్య్రం సెప్టెంబర్ 17, 1948లో తెచ్చిన మహానుభావులకు తెలంగాణ రుణపడి ఉంటుందన్నారు. సంస్కృతి లేకపోతే మనం లేమని, నేడు విలువలు క్షీణించి పోకుండా భవిష్యత్ తరాలకు తెలియజేసేలా తెలంగాణ వైభవం చాటి చెప్పడం అభినందనీయమని ఆయన కొనియాడారు. మన సంస్కృతి, వైభవాన్ని కాపాడేందుకు అన్ని విధాల కృషి చేస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తదితరులున్నారు.
*చిత్రం...సదస్సులో ప్రసంగిస్తున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ