తెలంగాణ

టీఆర్‌ఎస్ పార్టీ సభలా మారిన శాసనసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: శాసనసభను టీఆర్‌ఎస్ పార్టీ సభగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ శాసనసభలో అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. అవాస్తవాలకు కేసీఆర్ అంబాసిడర్‌గా మారారన్నారు. కాగ్ రిపోర్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై తప్పుబట్టిందన్నారు. దాదాపు రూ.3లక్షల కోట్ల అప్పుచేసి ప్రజలపై భారం మోపారన్నారు.
ప్రజలు నమ్మి టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో అధికారం ఇస్తే అప్పుల పాలు చేశారన్నారు. ఆర్థిక మాంద్యం లేదని, ఆర్థిక మాంద్యం అంటూ ప్రారంభమైతే వస్తే మొదట అమెరికాలో వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎటువంటి ప్రతిపాదనలు రాష్ట్రప్రభుత్వం సమర్పించలేదన్నారు. రాష్ట్రంలో రైతు బంధు పథకం ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎం అజెండాను అమలు చేస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశానికి చేటు, జాతీయ పార్టీల వల్ల మాత్రమే దేశ హితమన్నారు. బీజేపీ మాత్రమేకుటుంబ పాలనకు దూరమన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్