తెలంగాణ

రాష్ట్రాల అధికారాలు హరించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రాష్ట్రాలకు కేంద్రంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వమైనా అధికారాలను హరించాయని, అప్పుడు కాంగ్రెస్, ఈ రోజు బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయం బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆర్థిక స్థితి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లుగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. 33 జిల్లాల ప్రజలు మా పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చారన్నారు. బీజేపీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం మానివేశారని, ఆ పార్టీ నేతలు బయట మా భరతం పడతామని రోజూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. మా బలం 65 నుంచి 85కు పెరిగిందన్నారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 21 సీట్లు ఇస్తే, ఇప్పుడు 19 సీట్లు ఇచ్చారని, బీజేపీ బలం ఐదు నుంచి ఒకటికి తగ్గిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పార్టీ చేసిన త్యాగం, సాహసం మీరు చేశారా అన్నారు. అప్పులు రహస్యంగా చేయరన్నారు. ఈ విషయమై అవగాహన లేకపోతే ఏమి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులను అప్పు చేసి నిర్మించిందన్నారు. కాళేశ్వరం నిర్మిస్తే ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అన్నారు. ఆర్థిక మాంద్యం వల్ల మరో రూ.1400 కోట్ల నిధులు తగ్గనున్నాయన్నారు. ఇప్పుడున్న బడ్జెట్‌ను నిలబెట్టుకోవడానికి అద్భుతమైన ప్రణాళికలతో ముందుకుపోతామన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేస్తే దురుద్దేశాలు అంటకడతారా అన్నారు. కాంగ్రెస్ నేతలకు భౌగోళిక ప్రాంతం, నీటి లభ్యతపై పరిజ్ఞానం లేదన్నారు. బాధ్యతారహితంగా మాట్లాడకండి అని ఆగ్రహించారు. విపక్షాలు వితండ వాదం చేయడం తగదన్నారు. గత అసెంబ్లీలో రుణమాఫీపై అనేక ఆరోపణలు చేశారని, వాటిపై విచారణ చేయిస్తే ఒక్క దాంట్లో కూడా నిజంలేదని తేలిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 54 ఏళ్లు కాంగ్రెస్, ఆరేళ్లు ఇతర పార్టీలు, 11 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వం పాలించిందని, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలపడుతోందన్నారు. అన్ని పథకాలపై కేంద్ర గుత్త్ధాపత్యం పెరుగుతోందన్నారు.
రిజర్వేషన్లు మేమే పెంచుకుంటామంటే కూడా అనుమతి ఇవ్వడంలేదన్నారు. బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరితే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పట్టించుకోలేదన్నారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు చెందిన అనేక అధికారాలను ఉమ్మడి జాబితాలో చేర్చారన్నారు. రాష్ట్రాలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అన్నారు.
73 ఏళ్లుగా రాజ్యాంగాన్ని సమీక్షించే యత్నం చేయడం లేదన్నారు. విద్య, వైద్యం ఇంకా ఎన్నో స్కీంలకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆశించిన అధికారాలు, నిధులు రావడం లేదన్నారు. జీఎస్‌టీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు తమ పార్టీ పోరాడిందన్నారు. గుత్తాపెత్తందారీ విధానం పోవాలన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలన్నారు.
*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్