తెలంగాణ

దైవ దర్శనానికి వెళ్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూలై 10: దైవదర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురై తల్లీ, కొడుకులు తిరిగిరాని అనంతలోకానికి వెళ్లారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని ఖాదర్‌గూడెం గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ఆర్టీసి బస్సు-కారు ఢీకొన్న సంఘటనలో కారు నడుపుతున్న కొడుకు పెండ్యాల సుధీర్ (32), తల్లీ పెండ్యాల జ్యోతి (52) మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 12 మందితోపాటు అక్కడే ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. హన్మకొండ ఎన్‌జీవోఎస్ కాలనీకి చెందిన పెండ్యాల సత్యప్రకాష్ (58), అతని భార్య పెండ్యాల జ్యోతి (52), వారి కుమారుడు పెండ్యాల సుధీర్ (32), కూతుర్లు సృజన (23), పెద్దకూతురు సునీత (26), అల్లుడు సందీప్ (30), వీరి పిల్లలు సుమంత్, శషాంక్ కారులో వేములవాడకు దైవదర్శనానికి వెళ్తుండగా, మార్గమధ్యం ఖాదర్‌గూడెం వరకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న నిజామాబాద్-1డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. కారు నడుపుతున్న పెండ్యాల సుధీర్ కారులోనే అక్కడిక్కడే మృతి చెందగా, కారులో ఉన్న సత్యప్రకాష్, జ్యోతి, సృజన, సునీత, సందీప్, సమంత్, శశాంక్‌కు ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయ. వీరిని కరీంనగర్‌కు తరలించారు. జ్యోతిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. అలాగే ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి, రోడ్డు ప్రక్కన ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసి డ్రైవర్ సిరికొండ చిన్నభూమయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయన కారు. మృతి చెందిన తల్లీ, కొడుకులు జ్యోతి, సుధీర్