తెలంగాణ

హరితహారానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: మహానగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి సోమవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. దిల్‌కుశ గెస్ట్‌హౌజ్‌లో గవర్నర్ నరసింహన్, పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి ఒకే సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. వీరితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా మొత్తం రోజంతా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు 16.40 మొక్కలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 35 వివిధ విభాగాలు 1.50 మొక్కలు, ప్రైవేటు సెక్టార్‌కు చెందిన మరో 33 సంస్థలు 10.78 మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలకూ పంపిణీ చేసేందుకు సుమారు 3.57కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ కెబిఆర్‌పార్కు వద్ద స్వచ్ఛ వాలంటీర్లు, గ్రీన్ వాలంటీర్లను నియమించి, వారిచే మొక్కలను స్వీకరించే వారినుంచి, మొక్కలు నాటే సంస్థలు, వ్యక్తుల పేర్లు, వారి సెల్ నెంబర్లు, మెయిల్ ఐడితో సహ సేకరించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫలాలిచ్చే మొక్కలతో పాటు ఔషధ మొక్కలను కూడా నాటనున్నారు. వివిధ ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన స్టాళ్లనుంచి నేరుగా లేక ఆన్‌లైన్‌లో బుక్ చేసి గానీ మొక్కలను పొందవచ్చునని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఔషధ మొక్కలను జిఎంఆర్ ఎయిర్‌పోర్టు, చార్మినార్, జూబ్లీహిల్స్ మైండ్ స్పేస్, రహేజా ఐటి పార్కు, ఉప్పల్ జంక్షన్, పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్డు, కెబిఆర్ పార్కు ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోనే లక్ష మొక్కలను నాటాలని, వివిధ ప్రాంతాల్లో 50వేలకన్నా ఎక్కువ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారంలో మొక్కలు, వాటి పెంపకం, నిర్వాహణలకు రూ.24.50 కోట్లు కేటాయించినట్లు కమిషనర్ తెలిపారు.

బకెట్‌లో పడి చిన్నారి మృతి

దామరచర్ల, జూలై 10: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బండావత్ తండాలో హుస్సేన్, సునితల కుమారుడు మత్రు (11నెలలు) ఆడుకుంటూ పక్కింటికి వెళ్తూ గుమ్మం వద్ద ఉన్న బకెట్‌లోకి తొంగి చూసి తలకిందులుగా పడిపోయాడు. పక్కనే ఇంట్లో ఉన్న కొందరు పిల్లలు వచ్చి చూసేసరికి బాలుడు బక్కెట్‌లో పడి ఉండడాన్ని గమనించి కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు చూసి బాలుడి తల్లి సునితకు తెలిపారు. ఈ లోగానే బాలుడు మృతి చెందినట్లు గమనించిన తల్లి భోరున విలపించింది.