తెలంగాణ

కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, జనవరి 3: రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని, కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద కల్యాణం జరుగగా ప్రభుత్వం తరపున డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
అంతకు ముందు దేవాలయంలో ఉదయం దిష్టికుంభం, బలిహరణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంలో భాగంగా కొమురవెళ్లి మల్లికార్జునస్వామి, గొల్ల కేతమ్మ, బలిజమేడలమ్మ ఉత్సవ విగ్రహాలను దేవాలయ అర్చకులు ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. స్వామివారి తరపున పడిగన్నగారి మల్లేశం మాధవి దంపతులు, అమ్మవార్ల తరపున మహాదేవుని మల్లికార్జున్ సుజాత దంపతులు పీఠలపై కూర్చోగా మహంతయ్య, సాంబశివశర్మ, శశిభూషణ సిద్ధాంతుల మంత్రోచ్చారణలు నడుమ కల్యాణతంతును జరుపగా స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీశైల సూర్య సింహాసనాదీశ్వర జగద్గురు 1008 డాక్టర్ చెన్న సిద్దరాయ పండితాచార్య శివరామస్వామి ఆధ్వర్యంలో కల్యాణాన్ని జరిపారు. కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న కల్యాణ మంత్రోచ్చారణలు, స్వామివారి నామస్మరణతో మల్లన్న క్షేత్రం ఆదివారం మార్మోగింది. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ నర్సింగరావు, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహశిల్దార్ విజయ్‌సాగర్, ఎంపిడివో జ్యోతిరాణి, దేవస్థాన ఇవో వైరాగ్యం అంజయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, ఎంపిపిలు మేడిశెట్టి శ్రీ్ధర్, మాధవి, జెడ్పీటిసి సుంకరి సరిత, సర్పంచ్‌లు గీస బిక్షపతి, ముస్త్యాల అరుణ, సూటిపల్లి బుచ్చిరెడ్డి, పెడతల ఎల్లారెడ్డి, టిఆర్‌ఎస్ యూత్ జిల్లా ప్రదాన కార్యదర్శి బద్దిపడిగ క్రిష్ణారెడ్డి, నాయకులు శివగారి అంజయ్య, మంగోలు చంటి, ఒగ్గు శ్రీశైలం, ముస్త్యాల కిష్టయ్య, పుర్మ ఆగంరెడ్డితో పాటు భక్తులు పాల్గొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎఎస్పీ జాన్‌వెస్లీ, జనగామ డిఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సైలు సంతోషం రవీందర్‌తో పాటు 5గురు సిఐలు, 15మంది ఎస్సైలు, 250మంది పోలీసు సిబ్బంది భద్రతా చర్యలను చేపట్టారు.

చిత్రం... మల్లన్న కల్యాణాన్ని నిర్వహిస్తున్న పురోహితులు