తెలంగాణ

ఉత్తమ్ అభివృద్ధి నిరోధకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, అక్టోబర్ 9: టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండగా హుజూర్‌నగర్ నియోజకవర్గం దశాబ్ధకాలంగా అభివృద్ధిలో వెనుకబాటకు గురైందని ఇందుకు కారణం ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభివృద్ధి నిరోధకునిగా ఉండటమేని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని హేమ్లాతండా గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసమర్థత వల్ల ప్రజా సమస్యలపై ఏనాడు స్పందించలేదని, అధికారిక సమావేశాలకు హజరుకాలేదని, కనీసం సమీక్షా సమావేశాలకు వచ్చి సమస్యలు ఏకరవు పెట్టిన పాపన పోలేదన్నారు. అసలు ప్రజా సమస్యలపై ఆయనకు అవగాహనే లేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి సీఎం అవుతానని ప్రజలను మభ్యపెట్టి గెలిచాడని, ఎంపీ ఎన్నికల్లో కేంద్రంలో మంత్రిని అవుతానంటూ మరోసారి ప్రజలను మోసగించి గెలిచిన ఉత్తమ్‌కు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందని ఏద్దేవా చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని తండాల్లో ఇప్పటికీ మంచినీటి సమస్య అంతర్గత రోడ్లు, కాల్వ చివరి భూములకు ఎత్తిపోతల పథకాలు అందుబాటులో లేవని ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉండటం వల్లే ఇక్కడ అభివృద్ది జరుగలేదన్నారు. దేవుడు వరమిచ్చిన పూజరీ వరమివ్వలేదనే చందంగా కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిథులు కేటాయిస్తున్న పూజరీ అయిన ఉత్తమ్ వల్ల నిథులు చేరడం లేదన్నారు. నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్ది సైదిరెడ్డిని గెలిపిస్తే సీఎం కేసీఆర్ వద్ద కొట్లాడైన సరే అధిక నిథులు తెచ్చి అభివృద్ది చేస్తాడని అన్నారు. ఉత్తమ్‌ను గెలిపిస్తే ఆయనకు ఎక్కడ నుండి నిథులు తేచ్చే అవకాశం లేదని, ప్రజల బాధలు, రైతుల బాధలు తెలిసిన సైదిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్, శంకర్‌నాయక్, పార్టీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి