తెలంగాణ

ముగిసిన శరన్నవరాత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 9: వరంగల్ భద్రకాళి దేవస్ధానంలో గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు బుధవారంతో ముగిసాయి. ఉదయం 4గంటలకు నిత్యాహ్నికం జరిపిన తర్వాత సాయంత్రం అంత్యంత వైభవోపేతంగా జరిగిన భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణం అనంతరం జరపబడిన పూష్పయాగంతో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అట్టహాసంగా ముగిసాయి. విజయదశమి రోజున నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవం (జల క్రీడోత్సవం)లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు, నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు దంపతులు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు, పోలీస్ కమిషనర్ రవీందర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రాలు.. దేవీశరన్నవరాత్ర ముగింపు ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారిని సేవిస్తున్న
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
*దీదీప్యమానంగా తెప్పపై విహరిస్తున్న భద్రకాళి అమ్మవారు