తెలంగాణ

దసరా సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఆర్టీసీ సమ్మె కొనసాగడంతో పాటు ఇటు ఆర్టీసీ కార్మికులు , అటు ప్రభుత్వం సిగపట్లకు దిగడంతో కాలేజీలు, స్కూళ్లు, యూనివర్శిటీలకు వెళ్లే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పరిస్థితి సంకటంగా మారింది. సెలవులకు ఊళ్లు వెళ్లిన వారు తిరిగి సొంతూర్లకు చేరకపోవడం, దసరా సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కావల్సి ఉండగా, ఆర్టీసీ సమ్మెతో ఎవరికీ దిక్కుతోచడం లేదు. సమ్మె ముగుస్తుందేమో అని చూసిన విద్యార్థులకు ఇప్పట్లో పరిష్కారం కనిపించకపోవడంతో కాలేజీలకు, స్కూళ్లకు ఎలా వెళ్లాలనే ఆందోళనలో ఉన్నారు. కార్మికుల సమ్మెతో ప్రైవేటు బస్సులను, వాహనాలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం కాలేజీలు, స్కూళ్ల బస్సులను కూడా ప్రయాణీకుల అవసరాలకు ప్రైవేటు సిబ్బంది సహకారంతో నడుపుతోంది. మరో పక్క విద్యార్థి, యువజన సంఘాలు సైతం ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వడంతో అవసరమైతే మరో రెండు రోజులు దసరా సెలవులను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. గురువారం నాటికి పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుందని, సమ్మె కొనసాగే సూచనలు కనిపిస్తే విద్యాసంస్థలకు దసరా సెలవులను మరో రెండు రోజులు పొడిగించడమే ఉత్తమమని భావిస్తున్నట్టు విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవల్సి ఉండటంతో అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు.