తెలంగాణ
లక్ష్మీ బ్యారేజీ 11 గేట్లు ఎత్తివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 October 2019
మహదేవ్పూర్, అక్టోబర్ 11: జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మహదేవ్పూర్ మండలంలోని లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) 11 గేట్లను శుక్రవారం అధికారులు ఎత్తివేశారు. దీంతో బ్యారేజీలోని 5.812 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇ ఇ రమణారెడ్డి తెలిపారు. బ్యారేజీలోకి లక్ష 10వేల క్యూసెక్కుల నీరు రాగా అదే క్రమంలో 11 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే సరస్వతీ బ్యారేజీ (అన్నారం) ప్రస్తుతం ఒక గేటు ఎత్తి 45వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని, బ్యారేజీలోకి 46వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, ప్రస్తుతం 9.47 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.