తెలంగాణ

ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: ఆర్టీసీ సమ్మెను బలోపేతం చేయడానికి వివిధ రాజకీయ పార్టీల మద్దతు పొందేందుకు జేఏసీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. శుక్రవారం జేఏసీ నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. సమ్మెపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రతిపక్షాలు భరోసా ఇచ్చినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి థామస్‌రెడ్డి, కోదండరామ్‌తో కలసి రాజకీయ నేతల సహకారాన్ని కోరారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి సమ్మెను ఎంచుకున్నామన్నారు. సమ్మె ద్వారా ప్రజా రవాణాకు ఇబ్బందులు ఉన్నా ప్రజల
మద్దతు లభిస్తోందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని వారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా రవాణా దెబ్బతిన్నా పర్వాలేదు కానీ సీఎం తన మంకుపట్టు వదలడంలేదని వారు ధ్వజమెత్తారు. సమ్మె 7 రోజులుగా కొనసాగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. సీఎం భయపెట్డే ధోరణిని విడనాడాలని వారు హితవు పలికారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా వివిధ పార్టీల కేడర్ ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నందున కొంత సమయం కావాలని ఆయా పార్టీల నేతలు జేఏసీకి సూచించారు. సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించాయని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వంపై రాజకీయ పక్షాలు ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో సమ్మె ప్రభావంపై చర్చించామన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టే ధర్నాలు, రాస్తారోకోలకు మద్దతుగా బీజేపీ కేడర్ పాల్గొంటుందని లక్ష్మణ్ తమతో చెప్పారని వారు అన్నారు. ప్రభుత్వం నియంతృత్వ విధానాలను అవలంభిస్తోందని, అందువల్లే సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరెడ్డితో సమ్మెపై చర్చించామన్నారు. సమ్మెకు టీడీపీ మద్దతు ఇస్తుందని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ సంఘీభావం చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించారన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు శ్రీ్ధర్‌బాబు, రేవంత్‌రెడ్డి సమ్మెకు మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేశారు.